భారతీయ రైల్వేలో అత్యధిక లోడింగ్ సాధించిన జోన్‌గా తూర్పు కోస్తా రైల్వే నిలవడంలో సిబ్బంది కృషి ఎనలేనిదని జోన్ జనరల్ మేనేజర్ విద్యాభూషణ్ కొనియాడారు. భువనేశ్వర్‌లో నిర్వహించిన 66వ రైల్వే వారోత్సవాల కార్యక్రమంలో(WALTAIR DIVISION GOT AWARDS IN EAST COST RAILWAYS) ఆయన ఉత్తమ పని తీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాప్రతాలు, వివిధ విభాగాలకు షీల్డులను ప్రదానం చేశారు.
వాల్తేర్ రైల్వే కోచింగ్, ఆర్థిక, మానవ వనరులు, తుక్కు డిస్పోజల్, సిగ్నల్ అండ్ టెలికాం, క్రీడా విభాగాలకు లభించిన షీల్డులను వాల్తేర్ డీఆర్ఎం అనూప్ కుమార్ సతపతి, ఇతర అధికారులు జీఎం విద్యాభూషణ్ చేతుల మీదుగా అందుకున్నారు.
ఇదీ చదవండి:
Model Fishing Harbor : విశాఖకు మోడల్ ఫిషింగ్ హార్బర్ : కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి మురుగన్