ETV Bharat / city

లీజు నిబంధనలను ఉల్లంఘించారంటూ... విశాఖలో హోటల్‌ స్థలం స్వాధీనం

author img

By

Published : Nov 15, 2020, 2:17 PM IST

లీజు నిబంధనలను ఉల్లంఘించారంటూ ఓ హోటల్‌ స్థలాన్ని విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఆదివారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకొంది. విశాఖ సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ లీజుకు ఇచ్చిన స్థలంలో ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమాని నిర్వహిస్తున్న హోటల్‌ను అధికారులు ఆదివారం ఖాళీ చేయించారు.

VMRDA officials made to vacant fushion foods hotel at siripuram
విశాఖలో హోటల్‌ స్థలం స్వాధీనం

విశాఖ సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ లీజుకు ఇచ్చిన స్థలంలో ఫ్యూజన్‌ ఫుడ్స్‌ యజమాని నిర్వహిస్తున్నహోటల్‌ను అధికారులు ఆదివారం ఖాళీ చేయించారు. తెల్లవారుజాము 3గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగింది. పోలీసు బందోబస్తు నడుమ వీఎంఆర్‌డీఏ అధికారులు సిబ్బంది సాయంతో హోటల్‌లోని సామగ్రిని బయటకు తీసుకొచ్చి లారీల్లో తరలించారు. లీజు కొనసాగింపు విధానం సక్రమంగా లేకపోవడం, సంస్థ ఆదాయానికి భారీగా గండిపడటంతో లీజు రద్దు చేసి హోటల్‌ ఖాళీ చేయించినట్టు అధికారులు వెల్లడించారు.

ముందస్తు సమాచారం లేకుండా అర్థరాత్రి వచ్చి సామాగ్రిని ధ్వంసం చేసి ఖాళీ చేయించారని హోటల్‌ యజమాని హర్షవర్దన్‌ ఆరోపించారు. హోటల్‌ తాళాలు పగులకొట్టి, సెక్యూరిటీ సిబ్బందిని నిర్బంధించి లోపలున్న సామగ్రిని బయటపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఎంఆర్‌డీఏ నుంచి స్థలం లీజుకు తీసుకుని రూ.5కోట్లు పెట్టుబడితో హోటల్‌ నిర్మించామన్నారు. 2024 వరకు లీజు గడువు ఉన్నప్పటికీ ముందస్తు నోటీసులు లేకుండా అర్థరాత్రి వచ్చి ఖాళీ చేయించడం సరికాదని, బతిమాలినా అధికారులు కనికరించలేదని హర్షవర్దన్‌ అవేదన వ్యక్తం చేశారు.

తెదేపానేతల సంఘీభావం

సంఘటన తెలుసుకుని తెదేపా నేతలు ఫ్యూజన్ ఫుడ్ దగ్గరకు చేరుకొని హర్షకు మద్దతుగా నిలిచారు. న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని భరోసా నిచ్చారు. తెదేపా సానుభూతి పరులను లక్ష్యంతో దాడి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా లక్ష్యం చేసుకొని దాడులు చేసే పని మనుకుంటే మంచిదని విశాఖ తెదేపా పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

ఇదీ చదవండి:

ఆ కుటుంబంపై విధి చిన్నచూపు... ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.