ETV Bharat / city

నష్టాల్లో విశాఖ ఫిషింగ్ బోటు వ్యాపారులు - వైజాక్ ఫిషింగ్ హార్బర్ పై ప్రత్యేక కథనం

రాష్ట్రంలో అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ విశాఖ ఫిషింగ్​ హర్బర్. 800 బోట్లతో ప్రత్యేక్షంగా పదివేలు, పరోక్షంగా యాభై వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఏడాది క్రితం వరకు వేల కోట్ల రూపాయలు అందించిన ఈ ఫిషింగ్ హార్బర్ ... ప్రస్తుతం నష్టాల బాటలో పయనిస్తోంది. ఉన్న మెకానైజ్డ్​ బోట్లు అమ్మేసుకునే దుస్థితికి యజమానులు వచ్చేశారు. సరిగా వ్యాపారం లేదు. వేటకు వెళ్లినా.. కనీసం డీజిల్ డబ్బులు కూడా రావడంలేదు. ఇలాంటి పరిస్థితిలో విశాఖ ఫిషింగ్ హార్బర్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ఎక్కడి బోట్లు అక్కడే ఆగిపోయాయి. వేటలు సాగక కళాసీలు, పడవల పై కూలీలు ఖాళీగా కాలం వెళ్లదీస్తున్నారు.

vizag fishing boats loss story
నష్టాల్లో విశాఖ ఫిషింగ్ బోటు వ్యాపారులు
author img

By

Published : Jan 4, 2021, 3:46 PM IST

విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి కోట్లు విలువ చేసే మత్స్య సంపద యూరోప్, చైనా, ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. కానీ మూడేళ్లగా సరైన ఆదాయం లేక బోట్ల పై బతికే యజమానులు, కళాసీలు, హార్బర్​లో కూలీలు...అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు వచ్చే ఏడాది బాగుంటుందనే ఆశతో రోజులు గడుపుతున్నారు. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా విదేశాలకు ఎగుమతులు చేయలేక పోయారు. ఫలితంగా రొయ్యల ధరలు బారీగా పడిపోయాయి. ఒక్కపుడు కేజీ 1500 రూపాయలు ఉంటే ఇప్పుడే ఆ రేట్ 650 నుంచి 750 రూపాయలకు పడిపోయింది. పైగా రొయ్యల వేటకు వెళ్లే దూరం ఎక్కవ, డీజిల్ ఖర్చు ఎక్కువ. దీంతో పెట్టుబడి కూడా రావటం లేదని వ్యాపారులు కంటతడి పెడుతున్నారు.

నష్టాల్లో విశాఖ ఫిషింగ్ బోటు వ్యాపారులు

బెంబేలెత్తిస్తున్న డీజిల్ ధర...

ప్రధానంగా ఫిషింగ్ అంతా డీజిల్ రేట్ మీద ఉంటుంది.ఈ డీజిల్​పై ప్రభుత్వం లీటర్​కు తొమ్మిది రూపాయలు రాయితీ ఇస్తోంది. ఆ డబ్బులే యజమానులకు ఊరటనిస్తాయి. కానీ దురదృష్టం వల్ల మూడునెలల్లో 3 సార్లు పెరిగిన డీజిల్ ధర పడిపోయి.. ప్రస్తుతం 82.14 రూపాయలకు చేరింది. రాయితీ ఇచ్చినప్పటికి... పెరిగిన డీజిల్, తగ్గిన మత్స్య సంపద, ధరల వల్ల ... బోటు యజమానికి ఏమి మిగలటం లేదు. ఫలితంగా వారు వేట మాని, కేవలం నామమాత్రపు ధరకు బోట్లను అమ్మకానికి పెడుతున్నారు. ఒక బోటు తయారీకి ఇరువై లక్షలు అవుతుంది. అలాంటిది కేవలం లక్ష వస్తే చాలు బోటు అమ్మేస్తాం అంటున్నారు ... అంటే పరిస్థితి ఏ మేరకు దిగజారిందో ఊహించవచ్చు. ఇలాంటి గడ్డు రోజులు ఎన్నడూ.. చూడలేదని ఫిషింగ్ హార్బర్​లో ముప్పై ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న వాళ్లు అంటున్నారు. విదేశాలకు ఎగుమతి లేదు. స్వదేశంలో ఇతర రాష్ట్రాలలో అమ్ముకోవటానికి ధర లేకపోవడంతో అప్పుల పాలౌతున్నామని బోటు యజమానులు కన్నీరుమున్నీరు అవుతున్నారు .

నష్టాల్లో విశాఖ ఫిషింగ్ బోటు వ్యాపారులు

బోటుపై ఆధారపడిన బతుకులెన్నో...

ఒక బోటు యజమాని పై బోటు డ్రైవర్, ఎనిమిది మంది కళాసీ, ఒక మెకానిక్, ఒక వంట మనిషి , ఇద్దరి సహాయకులు బతుకుతుంటారు. బోటు వేటకు వెళ్లటానికి కనీసం పదివేలు... డీజిల్ ఖర్చు ఖచ్చితంగా అవుతుంది. లక్ష రూపాయలు పెట్టి వెళ్లినా తెచ్చిన చేపలు , ఇతర సముద్ర జీవాలు అమ్మినా దమ్మిడి మిగలడంలేదని ఆవేదన చెందుతున్నారు. అందులో ఈ ఏడాది కరోనా పుణ్యమా అని ఏడు నెలలు ఇంటి గుమ్మం దాటలేదు బోట్ యజమానులు. లాక్ డౌన్ తీసినా.. నివర్ తుఫాన్ లాంటి హెచ్చరికలతో మరింత చిక్కులు వచ్చిపడ్డాయి. యజమానికి కాలం వెళ్లక పొతే తమ బతుకు మరింత దారుణంగా ఉంటందని బోటు పై పనిచేసే కళాసీలు అంటున్నారు.

గడ్డుకాలం వచ్చింది..

ఓడలు బళ్లు కావచ్చు,.. కానీ ఇక్కడ బోట్లు బళ్లుగా మరటం అటుంచి... కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి . ఒక్కప్పుడు ఎనభై నుంచి వంద బోట్లు వేటకు వెళ్లితే ఇప్పుడు ఆ సంఖ్య పదుల్లో ఉంది. తెచ్చిన చేపలు, రొయ్యలు, స్థానిక మార్కెట్​కి సరిపోతున్నాయి. కానీ ఎగుమతులకు శక్తి ఉన్నా... విదేశాలకు పంపే అవకాశం లేకపోవడంతో విదేశీ మారక ద్రవ్యం కూడా కోల్పోతున్నారు . ఒక్కప్పుడు దగ్గరలో వేట చేస్తే చాలు కావలిసిన సంపద దొరికేది. ఇప్పుడు కిలోమీటర్లు వెళ్లిన సరుకు రావడం లేదు. ఈ లోపుగా ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఇంక అదే సంగతి. గాలిలో దీపంపెట్టి .. దేవుడా నువ్యే దిక్కు అనే చందంగా బోటు వేట ఉంది.

కారణాలు అనేకం..

కర్ణుడి చావుకు ఐదు కారణాల తరహాలో విశాఖ ఫిషింగ్ హార్బర్​లో ప్రతికూల పరిస్థితులకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. హుద్ హుద్ తుఫాన్లో పూర్తిగా పోయిన ఈ నిర్మాణాలను మత్స్య శాఖా బాగు చేసింది. ఇక్కడ నుంచి నేరుగా పోర్ట్ కు వెళ్ళడానికి జాతీయ రహదారి పై ప్రయాణం చేయడానికి సులువైన మార్గాలు ఉన్నాయి. సరికొత్తగా నూతన ఫిషింగ్ మార్కెట్ కూడా అందుబాటులోకి వచ్చింది.

మత్స్య శాఖా అధికారుల వివరణ..

ఈ ఏడాది ఉత్పత్తులు 20 శాతం మెరుగ్గానే ఉన్నాయని మత్స్య శాఖ అధికారులు చెప్తున్నారు. వ్యక్తిగతంగా మెరుగ్గా ఉన్నా... సమిష్టిగా చూసినప్పుడు ఇబ్బంది కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా మత్స్యకారులు పరంగా ఎంతమంది వేటకు వెళ్తున్నారు..ఎంత సరుకు వస్తోంది .. అనే ప్రణాళిక లేదు. అందరికి గుర్తింపు కార్డు జారీ పూర్తి కాలేదు. సరైన రక్షణ చర్యలు కూడా పాటించకుండా వేటకు వెళ్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వానికి నిర్దిష్ట క్రమంలో సమస్య తెలియజేస్తే మత్స్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వం పరంగా సహకారం అందించడానికి సిద్ధంగానే ఉందని చెప్తున్నారు. అలాగే వేట నిషేధ సమయంలో ఆర్ధిక సహాయంతో పాటు, మత్స్యకార భరోసా అందిస్తున్నట్టు చెప్తున్నారు. బోట్లు కొనే సమయంలో ప్రభుత్వం సహకారం కూడా అందిస్తోందని అంటున్నారు. ఎగుమతుల లేకపోయినా దేశీయ మార్కెట్ కు సరిపడే వ్యాపార లావాదేవీలు సంతృప్తి సూచికను విశాఖ ఫిషింగ్ హార్బర్ చేరుకున్నట్టు అధికారులు చెప్తున్నారు.

ఇదీ చదవండీ...అబ్బా చలేస్తుంది.. ఒక్క పెగ్గేస్తా అంటే తగ్గదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.