ETV Bharat / city

విశాఖ తీరప్రాంత అభివృద్ధికి జీవీఎంసీ ప్రతిపాదనలు - విశాఖ తీరప్రాంత అభివృద్ధి వార్తలు

తీర ప్రాంత రక్షణ, ఆరోగ్యం, ఆహ్లాదం ప్రాతిపదికన విశాఖ తీరాన్ని వృద్ధి చేసేందుకు మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ముందుకొచ్చింది. నగరంలోని ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి దాకా 27కి.మీ మేర పలు రకాల వినూత్న ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చింది.

vizag coastal area development
విశాఖ తీరప్రాంత అభివృద్ధికి జీవీఎంసీ ప్రతిపాదనలు
author img

By

Published : Dec 1, 2020, 6:53 PM IST

విశాఖ తీరప్రాంత అభివృద్ధికి జీవీఎంసీ నడుం బిగించింది. ఆర్​కే. బీచ్ నుంచి భీమిలి వరకు తీర ప్రాంతాన్ని పర్యటకంగా, పటిష్టంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది.

బ్రెజిల్ తరహాలో రాతిబాట

బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలోని బీచ్‌లో వందేళ్ల క్రితం రాతిముక్కలతో వేసిన ‘పోర్చుగీసు తీరబాట’ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. రాళ్లతో ఆకట్టుకునే డిజైన్లు రూపొందించారక్కడ. ఈ తరహాలో విశాఖ తీరం వెంబడి 27కి.మీ పాటు నడకబాట వేసేందుకు ఓ ప్రతిపాదన ఉంది. సూర్యకిరణాలకు ఏమాత్రం వేడెక్కని తరహాలో వినూత్న టైల్స్‌తో తీరం వెంట బాట వేయాలని మరో ప్రతిపాదనగా ఉంది. చెప్పులు లేకున్నా ఇందులో హాయిగా తిరిగే సౌకర్యముంటుంది. పై రెండింటిలో విశాఖకు అనువుగా ఉండే ఒక ప్రతిపాదనను అంగీకరించే అవకాశముందని జీవీఎంసీ అధికారులు తెలిపారు.

చైనా మాదిరిగా సేదతీరే ప్రాంతాలు

చైనాలోని హాంకాంగ్‌ బీచుల్లో పలుచోట్ల కూర్చునేందుకు, సేద తీరేందుకు వీలుగా విశాల ప్రాంతాల్ని ఏర్పాటు చేశారు. ఈ తరహాలో విశాఖ ఆర్‌కేబీచ్‌తో పాటు రుషికొండ, తెన్నేటి పార్క్, భీమిలి బీచ్‌ల్లోని స్థలాల్ని వృద్ధిచేయాలని జీవీఎంసీ ప్రతిపాదించింది. బీచ్‌కి అభిముఖంగా పచ్చికలు, బల్లలు విరివిగా పెట్టాలని యోచిస్తోంది.

ఆర్‌కే బీచ్‌ పటిష్ఠం

ప్రపంచ బ్యాంకు నిధులతో ఆంధ్రప్రదేశ్‌ విపత్తు పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ (ఏపీడీఆర్‌పీ)లో భాగంగా ప్రస్తుతం రూ.116 కోట్లతో ఆర్‌కేబీచ్‌ను వృద్ధిచేస్తున్నారు. తీరం కోతకు గురికాకుండా సుమారు 3 కి.మీ పొడవున బలమైన అడ్డుగోడ (రిటైనింగ్‌ వాల్‌)ను నిర్మించే పనులు మొదలయ్యాయి. ఇప్పుడున్న రోడ్లను రీడిజైన్‌ చేయనున్నారు. తీరం వెంబడి 11మీటర్ల మేర నడకబాటను వేయనున్నారు. దానికి అనుబంధంగా సైకిల్‌బాట, ప్రత్యేకించిన ప్రదేశాల్లోనే దుకాణాలు, పలు వ్యూపాయింట్లు రానున్నాయి.

విశాఖలోని ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకు 27కి.మీ తీరప్రాంతముంది. దీన్నంతటినీ వృద్ధిచేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. తుపాన్ల నుంచి రక్షణ పొందేందుకు తొలి ప్రాధాన్యంగా తీర రక్షణను కట్టుదిట్టం చేసేలా ప్రతిపాదిస్తున్నారు. విశాఖ నుంచి భీమిలి వరకు మొత్తం తీరాన్ని సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో గుర్తించి అక్కడ అడ్డుగోడలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

తెన్నేటి పార్కు-రుషికొండ తీర మార్గం తనివితీరా చూసేలా..

27కి.మీ మేర ప్రస్తుతం తీర రహదారి ఉంది. దీనికి అనుబంధంగా, తీరానికి అభిముఖంగా 3 మీటర్ల నడకబాట, 3 మీటర్ల సైకిల్‌ బాట వచ్చేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. మార్గమధ్యంలో పలు సైకిల్‌ స్టాండ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దారి పొడవునా సేద తీరేందుకు పచ్చికతో విశాల ప్రాంతాలు, పార్కింగ్‌ స్థలాలు, తాగునీటి వసతులు, మరుగుదొడ్ల సౌకర్యాల్ని తీసుకురావాలని నిర్ణయించారు. పర్యటకుల్ని ఆకర్షించేందుకు మరిన్ని ప్రత్యేకతలుండేలా కొన్ని ప్రాంతాల్ని సీఎస్‌ఆర్‌ నిధులతో వృద్ధిచేసేందుకు చూస్తున్నామని జీవీఎంసీ ప్రధాన ఇంజినీరు వెంకటేశ్వరరావు తెలిపారు.

మరో రూ.110కోట్లు

ప్రస్తుతం ఆర్‌కే బీచ్‌కు రూ.116 కోట్లు ఖర్చుపెడుతున్నారు. మిగిలిన తీరం అభివృద్ధికి మరో రూ.110 కోట్లు అవసరముంటుందని అంచనాలు వేస్తున్నారు. జీవీఎంసీ ప్రతిపాదనల మేరకు సర్వే నిర్వహించేందుకు, సమగ్ర ప్రతిపాదనలు (డీపీఆర్‌) రూపొందించేందుకు మరికొన్నాళ్లలో టెండర్లను పిలవనున్నారు.

ప్రాధాన్యాలతో ముందుకు

ముందుగా తీర భద్రత, ఆ తర్వాత ఆహ్లాదం, ఆ తర్వాత ప్రజా వసతుల్ని వృద్ధిచేసేందుకు ప్రాధాన్యంగా పెట్టుకున్నాం. ఎక్కడా కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) ఉల్లంఘటనలు జరగక్కుండా ప్రతిపాదనలు చేస్తున్నాం. డీపీఆర్‌ తయారయ్యాక ప్రజాభిప్రాయం తీసుకుంటాం. - డాక్టర్‌ జీ. సృజన, జీవీఎంసీ కమిషనర్‌

ఇవీ చదవండి..

ఉపాధి మార్గం.. తితిదే శిల్ప కళాశాల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.