విశాఖ నగరంలోని ప్రాంతీయ నిఘా, అమలు సంస్థ అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న జి.స్వరూపరాణి వృత్తి పరమైన విధులతోపాటు రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తూ పలువురి ప్రశంసలందుకుంటున్నారు. పలు సంచలన కేసులకు సంబంధించిన అంశాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా విశ్లేషిస్తూ కథనాలు రాస్తున్నారు.
- కీలక కేసుల్లో దర్యాప్తు అంశాలపై కథనాలు
- కిడ్నీమార్పిడి శస్త్రచికిత్సలు, సరోగసీ పేరుతో జరుగుతున్న అక్రమాలను కళ్లకు కట్టేలా లోతైన విశ్లేషణ చేస్తూ కథనాలు రాశారు.
- తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి గ్రామానికి చెందిన స్వరూపారాణి డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ఆసక్తి ఉన్న అంశాలపై వ్యాసాలు, రచనలు కొనసాగించేవారు. కళాశాల అంతర్గత మ్యాగజైన్లలో అవి ప్రచురితమయ్యేవి. ఆ ఉత్సాహంతో కథలు, కవితలు రాసేవారు. ఆ అలవాటే ఆమె ఉన్నతికి సోపానమయింది. చదవాలనే ఆసక్తి మెండుగా ఉండటంతో ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కాగలిగారు.
- కేసుల్లో విజయం సాధించడానికి దర్యాప్తు అధికారులు ఉపయోగించిన తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని ప్రస్తావిస్తూ మిగిలిన పోలీసులు కూడా ఆ విధంగా ఆలోచిస్తే వచ్చే ప్రయోజనాల్ని వివరించేవారు.
పోలీసుశాఖలోకి వచ్చిన తరువాత...
పలు కేసులకు సంబంధించిన అంశాలపై రచనలు చేయడం ప్రారంభించారు. పోలీసుశాఖ ‘సురక్ష’ పేరుతో తీసుకువస్తున్న మ్యాగజైన్‌లో ఈ రచనలు ప్రచురితమయ్యేవి. నైనా సాహ్ని, జెస్సికాలాల్, సైనేడ్ మల్లిక తదితర సంచలన కేసుల్లో నిందితులకు శిక్షలు పడడానికి పోలీసులు చేసిన కృషిని ఆసక్తికర కథనాలుగా మలిచారు.
ద్రోహులెవరు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో...
● నార్కో ఎనాలసిస్, లైడిటెక్షన్ పరీక్షలు వివిధ కేసుల దర్యాప్తుల చిక్కుముళ్లు వీడడానికి ఏవిధంగా సహకరిస్తున్నాయన్న వివరాలతో కేసులను విశ్లేషిస్తూ కథనాలు రాశారు.
● అత్యాచారాలకు, యాసిడ్ దాడులకు గురైన కొందరు బాధితులు ఆయా సంఘటనలనే తలచుకుంటూ బాధపడకుండా.... మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించి అత్యుత్తమ విజయాల్ని సాధించి ఆదర్శప్రాయంగా నిలిచిన స్ఫూర్తిదాయక ఉదంతాలపై కథనాలు రాసి పలువురు ప్రశంసలందుకున్నారు.
అలా.. సంకలనం..
స్వరూపా రాణి ఆసక్తిని గుర్తించిన నాటి డీజీపీ సాంబశివరావు ఆయా వ్యాసాలతో ప్రత్యేక సంకలనం ప్రచురిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో ‘ద్రోహులెవరు?’ పేరుతో ప్రత్యేక సంకలనాన్ని వెలువరించారు. ఆ పుస్తకాన్ని సాంబశివరావు ఆవిష్కరించారు. ఆ తరువాత రోజుల్లో కూడా పలు వ్యాసాలు రాశారు.
ప్రత్యేక రచనలన్నీ సంకలనంగా ముద్రణ
ఏయూలో మెరైన్ బయాలజీలో ఎంఎస్సీ... ఆపై బీఈడీ పూర్తి చేశారు. తొలుత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.సొంత ఊళ్లోనే నియామకం కావడం విశేషం. సంవత్సరం తరువాత ‘మత్స్య అభివృద్ధి అధికారి’గా ఎంపికయ్యారు. ఐదేళ్లు ఉద్యోగంలో కొనసాగారు. తరువాత గూప్-1 పరీక్షలు రాసి ఎం.పి.డి.ఒ.గా ఎంపికయ్యారు. ఐదేళ్లపాటు ఆ ఉద్యోగంలో కొనసాగిన అనంతరం డీఎస్పీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అదనపు ఎస్పీగా పదోన్నతి పొందారు.
అధ్యయనం చేస్తే ఆసక్తికర అంశాలెన్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసులను అధ్యయనం చేస్తే ఆసక్తికర విశేషాలు ఎన్నో తెలుస్తుంటాయి. ఆయా కేసుల్లో నిందితులకు శిక్షలు పడడానికి, కేసు కొట్టివేయడానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తే పోలీసులు వృత్తిపరంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే నేను పోలీసు మాసపత్రిక ‘సురక్ష’కు వ్యాసాలు రాయడం అలవాటు చేసుకున్నా. ఖాళీ సమయాల్లో ఇతర రాష్ట్రాల్లో జరిగిన కీలక కేసులపై దృష్టి సారిస్తుంటాను.
చదువు..ఉద్యోగాల పరంగా
కొన్ని కేసుల్లో శిక్షలు పడడానికి, వాస్తవాలు వెలుగులోకి రావడానికి ప్రజాసంఘాలు, మీడియా, బాధితుల కుటుంబసభ్యులు ప్రదర్శించే చొరవ, పట్టుదల కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తుంటాయి. సమాజంలో వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది కళ్లకు కట్టేలా కొన్ని కేసుల్లో జరిగిన పరిణామాల్ని విశదీకరించేవారు. - స్వరూపారాణి, అదనపు ఎస్పీ, ప్రాంతీయ నిఘా, అమలు కార్యాలయం
ఇదీ చదవండి: