కిటికీలో నుంచి బయటకు చూస్తే మేడలు. రోడ్డుపైకి వస్తే వాహనాల రణగొణధ్వనులు. మనకు మనమే ఏర్పరచుకున్న కాంక్రీట్ జంగిల్ పర్యవసానాలు ఇవి. జీవ వైవిధ్యంపై ఇది కొడుతున్న దెబ్బ మామూలుది కాదు. పక్షులు, ఇతర జీవరాశులను అక్కున చేర్చుకోవాలన్న మనసు ఉండాలే కానీ.. అవి ఇట్టే మనతో కలిసిపోతాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. విశాఖకు చెందిన లక్ష్మీనారాయణ. చిలకల్లో తన చిరు స్నేహితులను చూసుకుంటున్న ఈయన.. పదేళ్లకుపైగా వాటి ఆకలి తీరుస్తున్నారు.
విశాఖలోని కృష్ణా కళాశాల సమీపంలో నివసించే లక్ష్మీనారాయణ.. 2008లో తొలుత ఒకట్రెండు చిలుకలకు ఆహారమందించడం ప్రారంభించారు. చూస్తుండగానే వీటి సంఖ్య వందల్లోకి చేరుకుంది. రోజూ 3 సార్లు ఠంచనుగా వచ్చి మేడపై వాలిపోతుంటాయి.
చిలుకల సందడి వల్ల.. తమకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని కాలనీవాసులు అంటున్నారు. చిలుకలకు ఆహారం అందించడం ఏమాత్రం శ్రమ కాదని.. అవి రాకపోతే ఏదో వెలితిగా ఉన్నట్టు ఉంటుందని లక్ష్మీనారాయణ అంటున్నారు.
ఇదీ చదవండి: పొద్దునే లేస్తా.. చద్దన్నం తింటా.. సైకిలెక్కి పూలమ్ముతా..!