ETV Bharat / city

ఆక్సిజన్ ఉత్పత్తి పెంచిన ఉక్కు పరిశ్రమ .. వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా! - విశాఖ స్టీల్ ప్లాంట్​లో ఆక్సిజన్ సరఫరా న్యూస్

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్​ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరాతో మరోసారి తన ఉదారతను చాటుతోంది. దేశానికి రెండో దశ కరోనా కారు మేఘాలు కమ్మేసిన కాలంలో బాధిత రాష్ట్రాలకు ప్రాణ వాయువు సరఫరా చేయడానికి మేము ఉన్నామంటూ స్టీల్‌ ప్లాంట్‌ సిబ్బంది ముందుకు కదిలారు. ఫలితంగా రోజూ 100- 150 టన్నుల ప్రాణవాయువు అత్యవసరమైన రాష్ట్రాలకు సరఫరా చేయగలుగుతున్నారు.

ఆక్సిజన్ ఉత్పత్తి పెంచిన ఉక్కు పరిశ్రమ .. వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా!
ఆక్సిజన్ ఉత్పత్తి పెంచిన ఉక్కు పరిశ్రమ .. వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా!ఆక్సిజన్ ఉత్పత్తి పెంచిన ఉక్కు పరిశ్రమ .. వివిధ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా!
author img

By

Published : Apr 22, 2021, 10:38 PM IST

దేశంలో వివిధ ఆసుపత్రుల్లో చేరుతున్న ప్రతి 20 మంది కరోనా రోగుల్లో కనీసం ముగ్గురికి ప్రాణవాయువు అందించి చికిత్స చేయడం అనివార్యంగా మారింది. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న సమయంలో సిబ్బంది ఆందోళనలకు స్వస్తి చెప్పి ప్రాణ వాయువు అందించడానికి చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. దేశంలో పడకల సంఖ్య, మందుల సమస్య కన్న తీవ్రంగా నెలకొన్న ప్రాణవాయువు కొరత రోగులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రాణ వాయువు నిల్వలు చాలినంతగా లేని ఆసుపత్రుల్లో రోగుల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయి. ప్రాణ వాయువు నిల్వల కోసం ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ కేంద్రానికి ఒక ఆశాజనకమైంది.

స్టీల్‌ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తి అవసరాలకు ఆక్సిజన్‌ భారీ మొత్తంలో కావల్సి ఉంటుంది. ఆయా స్టీల్‌ ప్లాంట్‌లలో చేసిన ఉత్పత్తిలో మొత్తాన్ని స్టీల్‌ పరిశ్రమ అవసరాలకే అధికంగా వినియోగిస్తారు. ప్రస్తుత దేశ అవసరాల దృష్ట్యా విశాఖపట్నం, సెయిల్‌, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ వంటి సంస్థలు ఆక్సిజన్‌ ఉత్పతిని పెంచాయి. పరిశ్రమలు తయారు చేసే పారిశ్రామిక ఆక్సిజన్‌లో 90- 95 శాతం నాణ్యత ఉంటుంది. ఇందులో కొన్ని మలినాలు ఉంటాయి. వాటిని పూర్తిగా తీసి వేసి పూర్తి నాణ్యంగా తయారు చేస్తేనే ఆసుపత్రులలో ప్రాణం కోసం కొట్టుమిట్టాడే రోగులకు ప్రాణవాయువు వినియోగించే అవకాశం ఉంటుంది. ప్రాణవాయవు లేకుండా మందులు ఇతర చికిత్స విధానాలు కొవిడ్‌ రోగుల ప్రాణాలను నిలబెట్టలేవు.

ఇదీ చదవండి: ప్రైవేటు ఆస్పత్రులకు అందని ఆక్సిజన్- ఎంపీ ఫిర్యాదు

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్​లో అతిపెద్ద ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్‌ ఉంది. సాధారణంగా ఏటా సగటున ఇక్కడి నుంచి 8 వేల టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తుంటారు. ఈ ఆక్సిజన్‌ రెట్టింపు అంటే 16 వేల టన్నుల మేరకు ఉత్పత్తి చేసి.. వైద్య అవసరాలకు నూటికి నూరు శాతం నాణ్యంగా అందించగల చిత్తశుద్ధి గల సిబ్బంది, సాంకేతిక నైపుణ్యం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ సొంతం.

ప్రాణ వాయువు సరఫరా కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రపదేశ్‌తో పాటు దిల్లీ వంటి రాష్ట్రాలు ఇప్పుడు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి పైనే ఆశలు పెట్టుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నానికి ఏకంగా ఒక ఆక్సిజన్ ఎక్స్​ ప్రెస్‌ రైలును పంపింది. రోరో సర్వీస్ పేరిట రైల్వే నడుపుతున్న ఈ ప్రత్యేక రైలు 100 టన్నుల ఆక్సిజన్‌ను ఈ రోజు సాయంత్రం ఏడు ట్యాంకర్లతో తీసుకువెళుతుంది. మైనస్‌ 183 డిగ్రీల వద్ద నిల్వ చేయడం.. అంతకన్నా సురక్షితంగా రవాణా చేయడం కత్తిమీద సాములాంటిది.

ఇదీ చదవండి: ఆక్సిజన్​ సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.