ETV Bharat / city

'ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలి' - corona news

విశాఖ ఉక్కు ఉద్యమం 111వ రోజుకు చేరుకున్న సందర్భంగా.. లోక్ జనశక్తి పార్టీ అనుబంధ కార్మిక సంఘం జేఎమ్ఎస్ యూనియన్ సభ్యులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రాణాలకు తెగించి ఆక్సిజన్ తయారీతో దేశానికి సైనికుల్లా సేవ చేశామన్నారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబంలోని వారికి ఉద్యోగం కల్పించాలని యాజమాన్యాన్ని వారు డిమాండ్ చేశారు.

vizag steel plant agitations
ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలి
author img

By

Published : Jun 2, 2021, 7:38 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు 111వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో.. లోక్ జనశక్తి పార్టీ అనుబంధ కార్మిక సంఘం జేఎమ్ఎస్ యూనియన్ కార్యవర్గ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు.

కరోనాతో పోరాడి మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. విపత్తు సమయంలోనూ నిబద్ధతతో సంస్థ కోసం పనిచేస్తూ.. సుమారు 100 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. 60 మందికి పైన కార్మికుల కుటుంబాల్లోని వారు మృతి చెందినా.. ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారన్నారు. దేశంలో లక్షలాది మంది కరోనా రోగుల చికిత్సకు అవసరమైన ప్రాణ వాయువును అందించడంలో ఉక్కు కార్మికులు సైనికుల్లా పని చేశారని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును 100 శాతం అమ్మేస్తామని.. ఒకవేళ అమ్మలేకపోతే మూసివేస్తామని ప్రకటనలు చేస్తూ కార్మికులను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దీని వల్ల కార్మికులు మానసికంగా ఆందోళన చెందుతున్నారన్నారు.

ఇవీ చదవండి:

ఉద్యోగులకు కొత్త రూల్- ఉల్లంఘిస్తే పెన్షన్ కట్!

Prasanth: నాలుగేళ్ల తర్వాత ఇంటికి చేరిన ప్రశాంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.