విశాఖకు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ పరవాడ ఫార్మసీ... ఎన్నో విదేశీ ముందుల తయారీ కేంద్రాలకు నెలవుగా ఉంది. మొత్తం 2500 ఎకరాల విస్తీరణంలో 80 కంపెనీలు ఉన్నాయి. పరవాడలో ఇటాసి, ఫైజర్, హాస్పిరా, లూపిన్ వంటి అంతర్జాతీయ కంపెనీలూ ఉన్నాయి. వీటి కారణంగా మంచి ఉపాధి, ఆదాయ మార్గాలు విశాఖ జిల్లాకు వస్తున్నాయి. ప్రస్తుతం పది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
కరానా సమయంలో సైతం ఈ కంపెనీలు పని చేశాయి. విదేశాలకు సైతం ఉత్పత్తులు అందించాయి. ఈ ఫార్మా వల్ల మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. విశాఖలో ఫార్మా రంగానికి చక్కటి సౌకర్యాలు ఉన్నాయి. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటం, విశాఖ ఎయిర్ పోర్ట్ గంగ వరం పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల ఉత్పతులు విదేశాలకు రవాణా చేయటం అనుకూలమని పరిశ్రమల శాఖ చెబుతోంది.
నూతనంగా పరవాడ ఫార్మాలో పరిశ్రమ స్థాపించాలనుకునే వారికి ప్రభుత్వం సహకారం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే విశాఖలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ, పోర్ట్, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లతో పాటు విశాఖ పరవాడ ఫార్మా మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నట్టు అధికారులు చెబున్నారు.
ఇదీ చదవండి: