విశాఖ వాసుల మెట్రో కల వాస్తవ రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.విశాఖ మెట్రో రైల్ ఆచరణ దిశగా అడుగులు పడుతున్నాయి. 8వేల300 కోట్ల రూపాయల వ్యయం కానున్న ఈ ప్రాజెక్టు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో చేపట్టాలనే అంశం తెరపైకి వచ్చింది. ఇందులో నిర్మాణేతర వ్యయం కింద 49 శాతం నిధులు సమకూర్చేందుకు కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంకు ముందుకు వచ్చింది. మిగిలిన 51 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
విజయవాడ మెట్రో విషయానికి వస్తే....2015 లెక్కల ప్రకారం దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ 26 కిలోమీటర్లకు గాను 6వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అప్పట్లో ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ తర్వాతి కాలంలో కేంద్ర రాష్ట్ర మధ్య విభేదాలు తలెత్తడంతో దాదాపు అది అటకెక్కింది. పురపాలక శాఖమంత్రి నారాయణ, అమరావతి మెట్రో రైల్ అధికారులు కౌలాలంపూర్, చైనాల్లో పర్యటించి లైట్ మెట్రోపై అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. ఫ్రాన్స్ కు చెందిన సిస్ట్రా, జెర్మనీకి చెందిన గోపా, మన దేశానికి చెందిన రైట్స్ సంస్థలు సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారుచేస్తున్నాయి. ఇప్పటికే డీపీఆర్ కు సంబంధించి డ్రాఫ్ట్ సిద్ధం కాగా....త్వరలోనే తుది నివేదిక సిద్ధం కానుంది.
ఇదీ చదవండి