విశాఖలోని గోపాలపట్నం పరిధి ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి. పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమదం సంభవించి...రసాయన వాయువు లీకైంది. ఇది 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఈ గ్యాస్ లీక్ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాయు ప్రభావంతో కళ్లు కనపడక బావిలో పడి గంగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. రసాయన వాయు ప్రభావానికి ఆవులు , దూడలు మృత్యువాతపడగా, చెట్లు మాడిపోయాయి. వందల సంఖ్యలో బాధితులను ఆస్పత్రులకు తరలించారు. సాయంత్రానికి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కేజీహెచ్ వైద్యులు తెలిపారు. ఆర్.ఆర్.వెంటాపురంలో ఇళ్లలోనే ప్రజలు చిక్కుకుపోయారు. ఇప్పటికై సహాయక చర్యలు పోలీసులతో కలసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తలుపులు బద్దలు కొట్టి ఇళ్లలోకి వెళ్తున్న ఎన్డీఆర్ఎప్, అగ్నిమాపక సిబ్బంది.
కలెక్టర్ స్పందన
"స్పృహతప్పి పడిపోవడం ఈ గ్యాస్ సహజ లక్షణం. నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆక్సిజన్ ఇస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 300 మంది వరకు అస్వస్థతకు గురై ఉంటారని అంచనా వేస్తున్నాం. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను ఈ ప్రాంతం నుంచి కొత్త ప్రదేశానికి తీసుకెళ్తే వెంటనే రికవరీ అవుతారు. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం" అని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.
గ్యాస్ లీక్ ఘటన పై సీఎం ఆరా
విశాఖ ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటన పై సీఎం జగన్ ఆరా తీశారు. కలెక్టర్, కమిషనర్లతో ఫోన్ ద్వారా మాట్లాడారు. తక్షణమే సహాయకార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ప్రమాదం పై స్పందించిన మంత్రి అవంతి...
ఈ వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటన తెల్లవారు జామున 2.30 గంటలకు ప్రమాదం జరిగిందని మంత్రి అవంతి అన్నారు. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారని చెప్పారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి...