ETV Bharat / city

విశాఖ హెచ్​సీజీ క్యాన్సర్ సెంటర్​లో అరుదైన శస్త్రచికిత్స

author img

By

Published : Dec 7, 2020, 8:17 PM IST

విశాఖలోని హెచ్​సీజీ క్యాన్సర్ సెంటర్ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి విజయం సాధించింది. పెద్దపేగు క్యాన్సర్​తో బాధపడుతున్న మహిళకు సైటోరిడక్షన్ సర్జరీ విత్ హైపెక్ అనే అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు.

విశాఖ హెచ్​సీజీ కేన్సర్ సెంటర్​లో అరుదైన శస్త్రచికిత్స

విశాఖలోని హెచ్​సీజీ క్యాన్సర్ సెంటర్ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి విజయం సాధించింది. పెద్దపేగు క్యాన్సర్​తో బాధపడుతున్న గాజువాకకు చెందిన మౌనిక అనే మహిళకు సైటోరిడక్షన్ సర్జరీ విత్ హైపెక్ అనే అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. సాధారణంగా క్యాన్సర్​ చివరి స్టేజీలో ఉంటే నయం చేయటం చాలా కష్టం. కానీ...హరీష్, భాస్కర్ భువన్​లతో కూడిన హెచ్​సీజీ క్యాన్సర్ సెంటర్ వైద్యుల బృందం వినూత్న రీతిలో సైటో రిడక్షన్ సర్జరీ విత్ హైపెక్ పద్ధతిలో శస్త్ర చికిత్స నిర్వహించి ఆమెకు పునర్జన్మ ప్రసాదించారు.

ఆమె త్వరగా కోలుకొని రోజువారి కార్యక్రమాలు సులభంగా చేసుకోగలుగుతుందని వైద్యులు తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో నిర్వహించే ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్స విశాఖలో నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు.

ఇదీచదవండి

ఏలూరులో పెరుగుతున్న బాధితులు.. ఇవాళ ఒక్కరోజే...!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.