విశాఖ జిల్లాలో కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మరిన్ని క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కొవిడ్ టెస్టులలో పాజిటివ్ వచ్చిన వారిని తక్షణం కొవిడ్ ఆసుపత్రికి తరలించాలన్నారు.
జిల్లా కొవిడ్ కేంద్రాల్లో 2000 పడకలు.. నగరంలో 3వేలతో మొత్తం ఐదు వేల పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జీవీఎంసీ పరిధిలో రోజుకు రెండువేల పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు ఆర్డీవోలు నోడల్ అధికారులుగా ఉంటారని, వీటన్నింటికి సమన్వయ అధికారిగా జేసీ 3 వ్యవహరిస్తారన్నారు.
ఇదీ చదవండి: