విశాఖ మహానగర పాలక సంస్థ స్థాయి సంఘాలకు ఈనెల 27న ఎన్నికలను జరుగనున్నాయి. మొత్తం 98 వార్డుల కార్పొరేటర్లు ఈ స్థాయి సంఘాలకు సారధ్యం వహించేందుకు పోటీ చేసే వీలుంటుంది.
అధికార పక్షానికి చెందిన వారికే గరిష్టంగా ఈ స్థాయి సంఘం సారథులుగా అవకాశం లభిస్తుంది. ఓటింగ్ విధానంపై మేయర్ జి.హరివెంకట కుమారి సమక్షంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన ఇతర అధికార్లు కార్పొరేటర్లకు వివరించారు.
ఓటు హక్కు వినియోగం సహా, చెల్లని ఓట్లను ఎలా నిర్ణయిస్తారన్న అంశాలను తెలియజెప్పారు. జీవీఎంసీకి సంబంధించి స్థాయి సంఘాల సారథులుగా ఎన్నికయ్యేందుకు పలువురు ఇప్పటికే ఆసక్తి కనబరుస్తున్నారు. తమకు ఉన్న బలం దృష్ట్యా ఎన్ని దక్కించుకోగలమన్నది ఇప్పుడు అధికార, ప్రతిపక్షాలు లెక్కలు గడుతున్నాయి.
ఇదీ చదవండి: mp kavitha: ఎన్నికల్లో డబ్బు పంపిణీ.. తెరాస ఎంపీ మాలోత్ కవితకు జైలుశిక్ష