ETV Bharat / city

పర్యటకులతో కిటకిటలాడిన విశాఖ మ‌న్యం

ప్రస్తుతం విశాఖ మ‌న్యంలోని పర్యటక కేంద్రాలు సందర్శకులతో కళకళలాడుతున్నాయి. ఇక్కడి అందాలను ఆస్వాదించేందుకు శనివారం ఉదయం నుంచే.. పెద్ద ఎత్తున వీక్షకులు తరలివస్తున్నారు. రిసార్టులు, లాడ్జిలు నిండిపోతున్నాయి. పలువురు.. టెంట్లలో బస చేసేందుకు మొగ్గు చూపారు.

Breaking News
author img

By

Published : Dec 27, 2020, 5:49 PM IST

విశాఖ మ‌న్యంలో పర్యటకుల తాకిడి పెరిగింది. సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రా కశ్మీర్‌ లంబసింగి, చెరువులవేనం ప్రాంతాలకు ఆదివారం సైతం వేల సంఖ్యలో పర్యటకులు తరలివచ్చారు. ప్రధాన రహదారులు కిటకిటలాడాయి. సందర్శకులు మంచు అందాలను ఆస్వాదిస్తూ.. సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.

వ్యాపారుల్లో సంతోషం..

వారం నుంచి చింత‌ప‌ల్లి, లంబ‌సింగి ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. ప్రధాన సందర్శనీయ ప్రాంతాలకు పర్యటకుల తాకిడి పెరిగింది. అటు అనంతగిరి మండలంలోని బొర్రా గుహల నుంచి ఇటు చింతపల్లి మండలంలోని లంబసింగి వరకు పర్యటక ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. హోటళ్లు, లాడ్జిలు సంక్రాంతి వరకు బుక్కయ్యాయి. సందర్శకుల రాకతో ఆదాయం పెరిగిందని అక్కడి వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కేసుల సంఖ్య తగ్గింది.. సందర్శకుల సంఖ్య పెరిగింది..

సాధారణంగా ఇక్కడికి దసరా నుంచి సంక్రాంతి మధ్యలో సందర్శకులు అధికంగా వస్తుంటారు. కరోనా కారణంగా అక్టోబరు, నవంబర్​లో పర్యటకులు అంతంత మాత్రంగానే వచ్చారు. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు బాగా తగ్గిపోగా.. ఈ నెల ఆరంభం నుంచి సందర్శకుల రాక పెరిగింది. కొత్తపల్లి జలపాతం, లంబసింగి, తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో పర్యటకులు తరలి వస్తున్నారు. ముఖ్యంగా వారాంతపు, సెలవు దినాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

అప్పుడు తిరుగుముఖం.. ఇప్పుడు వెలుగులోకి..

గతంలో ఎక్కువమంది బొర్రా గుహలు, అరకులోయ, చాపరాయి సందర్శించి తిరుగుముఖం పట్టేవారు. పాడేరు, చింతపల్లి ప్రాంతాల వైపు పర్యటకుల రాక అంతగా ఉండేది కాదు. కానీ ఐదారేళ్ల క్రితం జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలం, లంబసింగి సమీపంలోని చెరువులవేనం వద్ద మేఘాల రమణీయ దృశ్యాలు వెలుగు చూడడంతో ఇటువైపు పర్యటకుల తాకిడి పెరిగింది. దీంతో యువత బైక్‌లు, కారుల్లో శనివారం రాత్రే వంజంగి చేరుకుని.. టెంట్లలో బస చేసి, క్యాంప్‌ ఫైర్‌తో సరదాగా గడిపారు. ఇక్కడి మేఘాల అందాలను తిలకించిన సందర్శకులు పులకరించిపోయారు.

ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్రత్యేక చ‌ర్య‌లు..

శ‌నివారం తెల్ల‌వారుజాము నుంచి లంబ‌సింగిలో ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌టంతో చింత‌ప‌ల్లి ఏఎస్పీ విద్యాసాగ‌ర‌ నాయుడు ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకున్నారు. లంబ‌సింగి, తాజంగి జ‌లాశ‌యం, కొర్ర‌బ‌య‌లుతో పాటు న‌ర్సీప‌ట్నం - చింత‌ప‌ల్లి మార్గంలో సాయుధ బ‌ల‌గాల‌ను మోహ‌రించి ప‌ర్య‌ట‌కుల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:

లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. తగ్గని పర్యాటకుల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.