కష్టపడి పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర లభించకని కారణంగా.. విశాఖపట్నం రైతులు ఇబ్బంది పడుతున్నారు. దేవరాపల్లిలోని మార్కెట్కు పరిసర గ్రామాల నుంచి రైతులు ఆదివారం కూరగాయలను తీసుకొచ్చారు. కనీసం గిట్టుబాటు ధర కూడా లభించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
కూరగాయలను తిరిగి తీసుకెళ్లలేక తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించారు. ఎక్కువ మొత్తంలో వచ్చిన నల్ల వంకాయలు కేజీ రూ.2 రూపాయలు కూడా పలకలేదు. ఈ కారణంగా.. కొందరు రైతులు తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్ లోనే పారబోశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: