విశాఖ తూర్పు నౌకాదళం డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ప్రాజెక్ట్స్ గా వైస్ అడ్మిరల్ శ్రీ కుమార్ నాయర్ బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు డీజీఎన్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ ముఖ్ నుంచి నాయర్ బాధ్యతలు స్వీకరించారు. నాయర్ నేవల్ డాక్ యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్ గాను, రక్షణ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ చీఫ్ మెటీరియల్ అధికారిగాను గతంలో సేవలందించారు. నాయర్ తన ఉత్తమ సేవలకు గాను 2010 లో నవ సేన మెడల్, 2021 లో విశేష సేవా మెడల్ పురస్కారాలను అందుకున్నారు.
ఇవీ చదవండి: