విశాఖకు చెందిన కొందరు వైకాపా నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. నగరంలోని 29వ వార్డుకు చెందిన వైకాపా నేత జోగా వెంకటరమణ, తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరారు. విశాఖ తెదేపా పార్టీ కార్యాలయంలో.. ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ వైకాపా నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరోనా సమయంలో తెదేపా చేపట్టిన కార్యక్రమాలు తమలో స్ఫూర్తిని నింపాయని పార్టీలో చేరిన వెంకట రమణ అన్నారు.
ఇదీ చదవండి : 'పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగ అభివృద్ధి'