విశాఖ స్టీల్ ప్లాంట్ వేతన ఒప్పందంపై ఆంక్షలు ఎత్తివేయాలని కార్మికులు(steel plant workers) డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ ఆధ్వర్యంలో 12 సంఘాలతో ప్రధాన పరిపాలనా భవనం ఎదుట యాజమాన్య వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించారు. అనంతరం యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా స్టీల్ గుర్తింపు యూనియన్ అధ్యక్షులు జె. అయోధ్య రామ్ మాట్లాడుతూ...గడచిన మూడు దశాబ్దాలుగా ఎన్జేసీఎస్ స్పూర్తికి విరుద్ధంగా మెజారిటీ సంఘాల పేరుతో కార్మిక ద్రోహానికి ఒడిగట్టారని స్టీల్ గుర్తింపు యూనియన్ అధ్యక్షులు జె. అయోధ్య రామ్ తీవ్రంగా విమర్శించారు. ఈ ఎంవోయూలో ఏ ఒక్క అంశానికి కూడా పూర్తిగా స్పష్టత లేకుండా ఉందన్నారు. ఈ సమయంలో వేతన జాప్యంపై పోరాడిన కార్మికులపై యాజమాన్యం అనేక నిర్బంధాలను ప్రయోగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం తమ వైఖరిని మార్చుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి