విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని విశాఖ జిల్లాకు చెందిన ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతిలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళనలో వారు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.
స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందనడం అవాస్తవమని..ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని, కేంద్ర మంత్రులకు ఇప్పటికే లేఖలు రాశామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్తో చర్చించి పార్లమెంట్లో విశాఖ ఉక్కును కాపాడేందుకు తమ పార్టీ ఎంపీలతో కలిసి పోరాడతామన్నారు. అవసరమైతే రాజీనామా చేయడానికి సిద్ధమని ఎంపీ ఎంవీవీ తెలిపారు.