విశాఖలోని ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటన పై కేంద్రహోంశాఖ ఆరా తీస్తోంది. గ్యాస్ లీక్ ఘటన పై అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు.
మృతులకు కిషన్ రెడ్డి సంతాపం
విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మరణించిన కుటుంబాలకు కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఎప్పటికప్పడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నాం అన్నారు. ఈ ఘటనలో వందలాది ప్రజలు అపస్మారక స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్రానికి అవసరమైన అన్ని సహాయ సహాకారాలు అందిస్తామన్నారు.
ఇవీ చదవండి...విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం.. ఎనిమిది మంది మృతి