ETV Bharat / city

మత్స్యకార గ్రామం టు మహానగరం..!

author img

By

Published : Mar 7, 2021, 7:01 AM IST

విశాఖ మహానగరంగా అభివృద్ధి చెందిన తీరు మిగిలిన నగరాలకు ఆదర్శంగా ఉంది. సహజంగా ఎన్నో వనరులు ఉన్న ఈ నగరం... తలసరి ఆదాయ సగటు, జీవన ప్రమాణ స్థాయి ఉన్నతంగా ఉంటుంది. వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు వచ్చిన వారితో ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాస్మోపాలిటన్ నగరంగా... మహానగర హోదా పొందింది. సింహాద్రి అప్పన్న అవాసమైన సింహగిరుల పవిత్రత, విశాల సాగర ఘోష, తూర్పు కనుమల సోయగానికి అలవాలంగా నిలిచింది. ఒకప్పుడు ఇసకపట్నంగా ఉన్న ఈ గ్రామం... అటు భీమిలి చరిత్రను ఇటు అనకాపల్లి బెల్లం తీపిని తనలో ఇముడ్చుకుని మహానగరంగా ఎదిగింది. పర్యాటక ఆకర్షణలతో మెరిసిపోయే ఈ నగరి రాష్ట్ర సిగలో మకుటాయమానంగా శోభిస్తోంది.

visakha: Fishing Village to Metropolis
visakha: Fishing Village to Metropolis

ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామంగా ఉన్న విశాఖ ఇప్పుడు మహానగరంగా విస్తరించింది. కిరోసిన్ దీపాల స్థాయినుంచి అటో సోలార్, ఎల్​ఈడీల వెలుగు జిలుగులతో అందరి దృష్టిని అకర్షిస్తోంది. బ్రిటిష్ హయాంలో వాల్తేర్​గా తర్వాత విశాఖపట్నంగా స్థిరపడిన ఈ మహానగర ఎదుగుదలను పరిశీలిస్తే అబ్బురమైన విషయాలు కానొస్తాయి. సముద్ర మార్గం ద్వారా దూర ప్రాంతం నుంచి వచ్చేవారికి జలరవాణాకు పూర్తి అనువుగా ఉండటంతో పాశ్చాత్య దేశాలను ఆకట్టుకుంది. సహజ నౌకాశ్రయం డచ్ కంపెనీలను, ఈస్ట్ ఇండియా కంపెనీలను తన వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోవడం మొదలుపెట్టింది.

ఈ ఓడరేవును అనుసంధానిస్తూ భారతీయ రైల్వే పటంలోకి విశాఖను చేర్చడంతో అభివృద్ధికి తొలి బీజం పడినట్టుగా చెబుతారు. అప్పటివరకు కుగ్రామంగా ఉన్న ఈ ప్రాంతానికి బయటనుంచి రాకపోకలు పెరిగాయి. కోల్​కతా- చెన్నై ప్రధాన మార్గంతో వైజాగ్ అనుసంధానం కావడం కలిసివచ్చింది. 1858లోనే మునిసిపల్ అసోసియేషన్​గా, 1866లో విశాఖపట్నం టౌన్... అల్లిపురం, పోర్టువార్డు, సీతారామస్వామి అలయం, వాల్తేర్ వార్డుతో కలసి మునిసిపాలిటీగా కొనసాగింది. 1872లో కేవలం ఆరు చదరపు మైళ్ల విస్తీర్ణంలో 32 వేల జనాభా మాత్రమే ఇక్కడ ఉన్నారు.

1904లో మద్రాస్ నుంచి కోల్​కతాకు రైలును అనుసంధానిస్తూ... విశాఖ మీదుగా తొలి రైలు నడిచింది. 1927లో ఈ ప్రాంత రైల్వే సేవలు విస్తృతమయ్యాయి. అప్పట్లో రైల్వే సంస్థకు అనుబంధంగా పోర్టు కొనసాగేది. 1933లో విశాఖ పోర్టు అవిర్భవించింది. విశాఖ నగరం ఎదుగుదలలో పోర్టుది కీలక భాగస్వామ్యం. పోర్టు ఏర్పాటు తర్వాత పారిశ్రామిక విస్తరణ వేగంగా జరిగింది. దీనికి అనుగుణంగానే ఇతర సదుపాయాలు ఏర్పాటుకు బీజాలుపడ్డాయి.

1923లో ఆంధ్ర వైద్యకళాశాల ఏర్పాటు, 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం... ఇలా విద్య, వైద్య సౌకర్యాల కేంద్రంగా విశాఖ రూపుమారుతూ వచ్చింది. ఆంధ్ర వైద్య కళాశాలకు అనుబంధంగా 30 పడకలతో కింగ్ జార్జి ఆసుపత్రి ఏర్పాటైంది. నౌకా సంబంధ కార్యకలాపాలకు ప్రాధాన్యం పెరగడంతో... నౌకాదళం ఏర్పాటుకు బీజం పడింది. క్రమంగా ఇది నౌకాదళ స్థావరంగా తూర్పుతీరంలో స్థిరపడింది. ప్రస్తుతం దాదాపు వందకుపైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, హెలీకాప్టర్​లు, విమానాలతో పూర్తిస్థాయి తూర్పునౌకాదళంగా ఎదిగింది. తీరప్రాంత రక్షణ దళం కోస్ట్ గార్డు దేశమంతటికి ఇప్పుడు విశాఖనే ప్రధాన స్థావరంగా మారింది.

విశాఖ పారిశ్రామిక నగరిగా వేగంగా విస్తరిస్తూ వచ్చింది. హిందుస్థాన్ షిప్ యార్డు, బీహెచ్​పీవి, హిందుస్థాన్ జింక్, హెచ్​పీసీఎల్, ఐఓసీ, బీపీసీ, కోరమాండల్ ఎరువుల కర్మాగారం, ఉక్కు కర్మాగారం వంటివి విశాఖ సిగలో ఒక్కొక్కటిగా వచ్చి చేరాయి. పారిశ్రామిక వాడగా గాజువాక ప్రాంతానికి దేశంలోనే గుర్తింపు వచ్చింది. 1955 నాటికి విశాఖ జనాభా లక్షా 20 వేలకు చేరింది. 1978 వరకు మునిసిపాలిటీగా ఉన్న విశాఖపట్నం... 1979లో నగర పాలక సంస్థ(వీఎంసీ)గా ఏర్పాటైంది. అప్పట్లో నగర జనాభా దాదాపు 10 లక్షలుగా ఉండేది. 50 వార్డులతో దీనిని ఏర్పాటు చేశారు. 2005లో గాజువాక మునిసిపాలిటీ సహా... శివారు 26 గ్రామ పంచాయతీలను విశాఖ నగర పాలక సంస్థలో విలీనం చేస్తూ... 2005 నవంబర్ ఒకటో తేదీన మహానగర పాలక సంస్థగా మార్చారు.

రెండేళ్ల కిందట భీమునిపట్నం, అనకాపల్లి మునిసిపాలిటీలను విశాఖలో విలీనం చేశారు. ఇప్పుడు ఎనిమిది జోన్లు, 98 వార్డులతో విశాఖ విస్తరించింది. ప్రస్తుతం 25 లక్షలకుపైగా ఉన్న జనాభాలో.. 18 లక్షలకుపైగా ఓటర్లున్నారు.

ఇదీ చదవండీ... అందర్నీ భయపెట్టడం రాజకీయమా?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.