ఆక్సిజన్ కొరత తీర్చేందుకు తూర్పు నౌకాదళంలోని విశాఖ డాక్‌యార్డ్ చర్యలు చేపట్టింది. మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ఆన్ వీల్స్ పేరిట అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ వీటిని ప్రారంభించారు. ఈ ప్లాంట్లను ఆసుపత్రిలోనూ అనుసంధానించే విధంగా సాంకేతిక నిపుణులు రూపొందించారు. ఈ ప్లాంట్లను మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తీసుకెళ్లవచ్చునని అధికారులు తెలిపారు.
ఇదీచదవండి