GVMC New Circular on Garbage Tax: విశాఖ కార్పొరేషన్ అధికారులు వింత ఆదేశాలు జారీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 50 శాతం చెత్త పన్ను వసూలు చేయకపోతే ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామంటూ.. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. చెత్త పన్ను సరిగా వసూలు కాకపోవడంపై అసహనంతో ఉన్న అధికారులు.. ఇలాంటి ఆదేశాలివ్వడం దుమారానికి కారణమైంది. జీవీఎంసీ జోనల్ కమిషనర్ పేరిట కొత్త సర్కులర్ జారీ కావడంపై.. శానిటరీ, వార్డు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చెత్త పన్ను సరిగా వసూలు కాకపోతే.. తమ జీతాల్లో కోత విధించడమేంటని మండిపడుతున్నారు. ఇలాంటి సర్కులర్లు జారీ చేస్తే.. సహించేది లేదని ఉద్యోగ సంఘాల నాయకులు తేల్చిచెబుతున్నారు.
ఇదీ చదవండి: వెంకట్రావు పిటిషన్‌పై.. కలెక్టర్ ఆదేశాలు సస్పెండ్ చేసిన హైకోర్టు
విశాఖ కార్పొరేషన్ వింత సర్క్యులర్ జారీ.. ఉద్యోగుల ఆగ్రహం - చెత్తపన్ను కోసం వేతనాల్లో కోత విధిస్తామన్న జీవీఎంసీ
13:23 March 24