ETV Bharat / city

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు... సముద్రంలో వేట నిషేధం - dipression in bay of bengal

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి విశాఖలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ వినయ్ చంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందరు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్​ రూమ్​లు ఏర్పాటుచేయాలన్నారు. వేట నిషేధించి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు. కలెక్టరేట్​లో టోల్ ఫ్రీ నెంబర్లు 0891-2590102, 0891-2590100 ఏర్పాటు చేశారు.

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు
విశాఖ జిల్లాలో భారీ వర్షాలు
author img

By

Published : Oct 11, 2020, 10:26 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో... రేపు ఉదయం నుంచి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ సూచన దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి తీవ్రత పెరగవచ్చన్న వాతావరణ శాఖ సూచనలను మేరకు ఆర్డీవో, ఇరిగేషన్, వ్యవసాయం, మత్య్స శాఖ, రహదారులు భవనముల శాఖ అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అంతా అప్రమత్తం

జిల్లాలోని రైవాడ, తాండవ, కోణాం, పెద్దేరు జలాశయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని, జలాశయాలకు దిగువనున్న గ్రామస్థులను అప్రమత్తం చేసి నీటిని విడుదల చేయాలని కలెక్టర్ అన్నారు. మండలాల్లోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పరిశీలించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు మండల కేంద్రాల్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలను ఆదేశించారు. తీర ప్రాంత మండలాల్లోని తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది అప్రమత్తతో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్​ రూమ్​లు

జిల్లాలోని ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్లను ప్రజలకు తెలియజేయాలన్నారు. మత్య్సకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకుండా నిషేధించాలని ఆదేశించారు. వేటకు వెళ్లి సముద్రంలో ఉన్న వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టాలను పరిశీలించి నివేదికలను అందజేయాలని వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ అధికారులను కోరారు. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకులు అప్రమత్తతతో ఉండాలన్నారు. రహదారులలో ఎక్కడైనా చెట్లు కూలి రవాణాకు అంతరాయం కలిగితే తక్షణమే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లు 0891-2590102, 0891-2590100 ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి కోనసీమలో భారీ వర్షాలు... మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.