విశాఖ నగరంలోని ప్రముఖ సూపర్ మార్కెట్లలో... విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అదనపు ఎస్పీ స్వరూపరాణి ఆధ్వర్యంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన నిత్యవసర వస్తువులు విక్రయిస్తున్నారన్న సమాచారంతో... సోదాలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వస్తువుల నమూనాల్ని నాణ్యత పరీక్షలకు పంపామన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి: మిజోరంలో రూ.5.9 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత