ETV Bharat / city

'ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఆలోచనల్లో మార్పు రావాలి'

ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల నిలయంగా భారత్ నిలుస్తోందన్న తాజా నాస్కామ్ నివేదిక సంతోషకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అన్ని భారతీయ అంకుర సంస్థలు మంచి విజయాలు, ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్ స్టార్టప్​లలో 50 శాతం మంది కరోనాకు ముందు ఉన్న పరిస్థితుల దిశగా త్వరలోనే పుంజుకుంటారన్న సంకేతాలు శుభపరిణామన్నారు. యువతలో పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు నిధులు సమకూర్చాల్సిందిగా కార్పొరేట్ రంగాన్ని కోరిన ఆయన, ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయాలకు సూచించారు.

Vice president venkaiah naidu
Vice president venkaiah naidu
author img

By

Published : Dec 8, 2020, 7:46 PM IST

Updated : Dec 8, 2020, 8:02 PM IST

అంతర్జాలయం వేదికగా జరిగిన ద ఇండ్ యూఎస్ ఎంటర్‌ప్రెన్యూర్స్(టి.ఐ.ఈ) గ్లోబల్ సమ్మిట్ -2020ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రసంగించారు. లాభాపేక్ష లేని టీఐఈ సంస్థ సిలికాన్ వ్యాలీ ఆధారితంగా పనిచేస్తోంది. ఇది నెట్‌వర్కింగ్ ద్వారా అంకుర సంస్థలకు (స్టార్టప్స్) సహకారం అందిస్తోంది. భారతదేశంలోకి పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు అంతర్జాతీయ సమ్మేళనం-2020 నిర్వహిస్తోంది. విశాఖలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సదస్సులో మాట్లాడుతూ, ప్రతిభావంతులైన యువత శక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగార్థులు కాకుండా.. ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఆలోచనల్లో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.

  • Today’s youngsters have a chance like no other generation have had in the past. They can create a more prosperous, dynamic and just world! #TGS2020 pic.twitter.com/QUnDRsXKdY

    — Vice President of India (@VPSecretariat) December 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

యావత్​ ప్రపంచానికి ఆర్థిక అవకాశాలు

ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించడమంటే, సరైన ఆర్థిక విధానాన్ని అనుసరించి, ఉత్తమ విద్యా పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని, ఆవిష్కరణలు, ఆలోచనలు ఏకకాలంలో వృద్ధి చెందాలని వెంకయ్య అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విజయాలు సృష్టించే ఆర్థిక అవకాశాలు భారతదేశం కోసం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికి ఉపయోగపడతాయన్నారు.

టీఐఈ కృషి అభినందనీయం

మహిళల ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్య ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని వెంకయ్యనాయుడు సూచించారు. మెంటరింగ్ ద్వారా 50 వేల మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను టి.ఐ.ఈ. ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు దిశా నిర్దేశం చేసేందుకు 300 మందికిపైగా మెంటర్స్ అందుబాటులోకి తెచ్చిన టీఐఈ కృషిని అభినందించారు.

అనుభవాలు పంచుకోండి

ప్రతిభావంతుల నుంచి చక్కటి ఔత్సాహిక పారిశ్రామిక ఆలోచనలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయని, సిలికాన్‌వ్యాలీ లాంటి చోట్ల మాత్రమే కాకుండా హైదరాబాద్, విశాఖ వంటి ప్రదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి సాధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలతో తర్వాతి తరానికి మార్గదర్శనం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి : భాజపా-జనసేన నేతల భేటీ.. కీలకాంశాలపై చర్చ

Last Updated : Dec 8, 2020, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.