మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరధిలోనిదే అని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన..సీఎం జగన్ తనకు మంచి మిత్రుడని, తను ఎన్‌డీఏలో చేరాలని కోరారు. ఎన్‌డీఏలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు జరుగుతుందన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని.. అయితే ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేశామన్నారు. మరో 15 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేదన్నారు. పీవోకే (POK) భారత్‌లో అంతర్భాగమని..పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పీవోకే వదిలి వెళ్లాలన్నారు. పీవోకే వీడితేనే భారత్-పాక్ మధ్య స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సీఎం జగన్ నాకు మంచి మిత్రుడు. జగన్‌ను ఎన్‌డీఏలో చేరాలని కోరుతున్నా. ఎన్‌డీఏలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు. మూడు రాజధానుల అంశం..రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం. ప్లాంట్ ప్రైవేటీకరణతో రిజర్వేషన్లకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం. మరో 15 ఏళ్ల వరకు కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదు. పీవోకే.. భారత్‌లో అంతర్భాగం. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పీవోకే వదిలి వెళ్లాలి. పీవోకే వీడితేనే భారత్-పాక్ మధ్య స్నేహం కొనసాగుతుంది. -రాందాస్ అథవాలే, కేంద్ర మంత్రి
ఇదీ చదవండి