ETV Bharat / city

Woman Trafficking: మహిళ అక్రమ రవాణా కేసు.. ఇద్దరు అరెస్టు - విశాఖ జిల్లాలో మహిళా అక్రమ రవాణా కేసులో ఇద్దరు అరెస్ట్

Woman trafficking: ఓ వైపు మాదకద్రవ్యాల రవాణా కలకలం సృష్టిస్తోంది. మరోవైపు మానవ అక్రమ రవాణా అందరినీ కలవరపరుస్తోంది. డబ్బు కోసం మహిళలను మాయమాటలు చెప్పి... అక్రమంగా రవాణా చేసి బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దింపుతున్నారు కొందరు నీచులు. తాజాగా మానవ అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులను పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు.

Two arrested in woman trafficking
మహిళ అక్రమ రవాణా కేసులో ఇద్దరి అరెస్టు
author img

By

Published : May 5, 2022, 9:35 AM IST

Woman trafficking: మానవ అక్రమ రవాణా కేసులో ఓ మహిళ సహా మరో వ్యక్తిని పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. సుజాతనగర్‌ సీ-2 జోన్‌లో ఉంటున్న బి.ధనలక్ష్మీ(37) వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. ఆమెకు బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందిన నుపుర్‌ అలియాస్‌ ఆది, పాపియ అలియాస్‌ పప్పీలతో స్నేహం ఉంది. వారి సలహా మేరకు ఢాకాకు చెందిన మహిళ(26) గత నెల 23న సరిహద్దు దాటి కోల్‌కతాలోకి ప్రవేశించింది. ఆమెకు అక్కడ మున్నీర్‌ (24) అనే వ్యక్తి భారత్‌ వీసా ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో గత నెల 27 వరకు అతడి ఇంట్లోనే ఉంది. మున్నీర్‌ ఆమెకు నకిలీ ఆధార్‌కార్డు సృష్టించి మొబైల్‌ సిమ్‌ కార్డు సమకూర్చాడు. షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో గత నెల 28న విశాఖ పంపించాడు.

మహిళను ధనలక్ష్మీ, హైదరాబాద్‌ కూకట్​పల్లికి చెందిన ఎ.వినీత్‌ (28) రైల్వేస్టేషన్‌ నుంచి సుజాతనగర్‌కు తీసుకొచ్చారు. ధనలక్ష్మీ తన ఇంట్లో బంగ్లాదేశీ మహిళతో ఈనెల 3వ తేదీ వరకు వ్యభిచారం చేయించింది. సోదరుడి ఆరోగ్యం బాగోలేదని సమాచారం అందడంతో ఆ మహిళ ఢాకా వెళ్లిపోతానని ధనలక్ష్మీని కోరింది. అంగీకరించకపోవడంతో బాధితురాలు తన సోదరుడికి ఇక్కడి పరిస్థితిపై సమాచారం అందించింది. అతను విశాఖ సీపీకి సమాచారం అందించారు. సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ధనలక్ష్మీ ఇంటిపై దాడి చేసి బాధితురాలిని కాపాడి కేజీహెచ్‌కు పంపించి నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: సోషల్ మీడియాలో పరిచయం.. కలిసి తిరగడం.. కట్​చేస్తే చెప్పుదెబ్బ!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.