విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తితిదే అమలు చేస్తున్న కార్యక్రమాలను స్వామికి వివరించారు. తితిదే నిర్వహిస్తున్న కళ్యాణమస్తు కార్యక్రమం మారుమూల ప్రాంతానికి చెందిన భక్తులకు సైతం చేరువయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని స్వరూపానంద సూచించారు.
గిరిజన గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన ఆలయాల పని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. స్వరూపానంద స్వామి చేసిన సూచనలపై ఈవో జవహర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలో వాటికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: