ETV Bharat / city

ట్రాన్స్​జెండర్ దాతృత్వం.. పరిమళించిన మానవత్వం - విశాఖలో కరోనా కేసులు

లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక అల్లాడుతున్న ఎంతోమందికి.. దాతలు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్​జెండర్లు కూాడా.. ఈ సేవలో భాగస్వాములవుతున్నారు.

Transgender Helping
Transgender Helping
author img

By

Published : Apr 30, 2020, 7:39 PM IST

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రజల్లో మానవత్వం పరిమళిస్తోంది. ఉన్న దాంట్లో మరొకరికి సాయం చేసే గొప్ప గుణం పెరుగుతోంది. అలాంటి సంఘటనే విశాఖ కంచరపాలెం ప్రాంతంలో కనిపించింది. ట్రాన్స్ జెండర్.. పేరు మల్లిక.. పరిస్థితులు సహకరించక రోడ్లపైన, దుకాణాల వద్ద తిరుగుతూ.. వారు ఇచ్చిన డబ్బులతోనే పొట్టనింపుకొనేది. లాక్​డౌన్ వేళ తన చుట్టూ ఉండే వారు ఆకలితో అలమటిస్తుండటం చూసి.. మల్లిక చలించిపోయింది.

గతంలో తన ఆకలి తీర్చిన వారి రుణం తీర్చుకోవాలనుకుంది. తాను దాచుకున్న సొమ్ముతో ప్రతిరోజు సుమారు 200 మందికి భోజనాన్ని వండి వడ్డిస్తోంది. ఆ విషయం తెలుసుకున్న కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు మల్లిక చేస్తున్న సేవకు చేదోడుగా నిలిచి వంటకు కావాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు.

లాక్ డౌన్ తో పేదలు, కూలీల బతుకు భారంగా మారింది. కంచరపాలెం రైల్వే గేటు పట్టాల పక్కన బ్రిడ్జి కింద నివాసం ఉంటున్న వారి జీవితం దుర్భరమైంది. వీళ్లంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. ఈ కష్ట కాలంలో వాళ్ల కడుపు నింపుతోంది ట్రాన్స్ జెండర్ మల్లిక. లాక్ డౌన్ మొదలైన రెండో రోజు నుంచే ఆమె పేదలకు, కూలీలకు భోజనాలు అందించడం ప్రారంభించింది.

కొంతమంది వ్యాపారులు, సాయం చేసే దాతల నుంచి బియ్యం, పప్పు దినుసులు సేకరిస్తోంది. వాటితో అన్నం, సాంబారు, ఒక కూరతో ఆహారాన్ని వండి ఆకలితో ఉన్న పేదల వద్దకు తీసుకెళ్లి వారికి వడ్డించి పెడుతోంది. అంతేకాదు అక్కడున్న మహిళలకు చీరల్ని పంచిపెడుతోంది. తాను కూడా ఇదే స్థాయి నుంచి ఎదిగానని.. తాను పెరిగిన చోట పలువురు ఆకలితో పడుతున్న బాధలను చూసి ఈ నిర్ణయం తీసుకున్నానని మల్లిక చెబుతోంది.

ట్రాన్స్ జెండర్ల గురించి తప్పుగా ఆలోచించే ప్రతిఒక్కరూ తాము చేస్తున్న సేవల్ని చూసి స్ఫూర్తి పొందాలని మల్లిక కోరుతోంది. సాయానికి ముందుకు రావాలని పిలుపునిస్తోంది.

ఇవీ చదవండి:

రేపు.. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మందికి పింఛన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.