ముఖ్యమంత్రి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను నిరాశపరిచిందని టీఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ అన్నారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తానని.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 26,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. జాబ్ క్యాలెండర్ ద్వారా అంకెల గారడీ చేశారన్నారు.
ఏపీపీఎస్సీ అవకతవకల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా కొట్టిన చెంపదెబ్బకు జాబ్ క్యాలెండర్‌తో ఆయింట్మెంట్ రాస్తున్నట్లుగా ఉందని ప్రణవి గోపాల్ ఎద్దేవా చేశారు. కనీస వేతనం లేని వాలంటీర్ జాబ్‌లను కూడా, ఉద్యోగాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి, నిరుద్యోగులకు సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గోపాల్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: AP Jobs: జాబ్ క్యాలెండర్ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!