ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్ : విశాఖ జిల్లాలో పూర్తిస్థాయి లాక్​డౌన్

విశాఖ జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా పూర్తి లాక్​డౌన్ నడుస్తోంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి గ్రామీణ ప్రాంతాలను అత్యంత సున్నిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని స్వీయ నిర్బంధంలో ఉంచి, వారిని 94 బృందాలు నిత్యం పర్యవేక్షిస్తున్నాయి.

Three areas in vizag has declared as sensitive areas
కరోనా ఎఫెక్ట్ : విశాఖ జిల్లాలో పూర్తిస్థాయి లాక్​డౌన్
author img

By

Published : Mar 26, 2020, 7:21 PM IST

విశాఖ లాక్​డౌన్ వివరాలు తెలుపుతున్న ఈటీవీ భారత్ ప్రతినిధి

విశాఖ జిల్లాలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. విశాఖలో లాక్​డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. వివిధ కళాశాలల మైదానాల్లో రైతుబజార్లు నడుపుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, స్వీయ నిర్బంధంలో ఉంచుతున్నారు. అత్యంత సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు మరింత విస్తృత పరిచారు. 94 బృందాలు విదేశాల నుంచి నగరంలోకి వచ్చిన వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తున్నారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​పై విశాఖ పోలీసుల ప్రచార చిత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.