Indian naval maneuvers : ఫిబ్రవరి 21న ముగిసిన భారత నౌకాదళ విన్యాసాలపై ఇండియన్ నేవి ఓ లఘు చిత్రాన్ని విడుదల చేసింది. విశాఖలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన నేవీ కార్యక్రమాలను గురించి 10 నిమిషాల నిడివితో చిత్రం రూపుదిద్దుకుంది. నౌకాదళ కమాండోల సాహస కృత్యాలు, కవాతుల ప్రదర్శన, యుద్ధనౌకల విన్యాసాలు, సబ్‌మెరైన్‌ల పనితీరును మొత్తం 35 కెమెరాలతో చిత్రికరించారు. మొత్తం 10వేలకు పైగా నావికులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ ఆధారంగా షార్ట్ ఫిల్మ్ రూపొందింది.
ఇదీ చదవండి: President Tour: విశాఖలో పీఎఫ్‌ఆర్.. గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి