ETV Bharat / city

Pattabhi On ORR: 'అలా కేంద్రానికి లేఖ రాసి.. ఓఆర్ఆర్​కు ఉరి వేశారు'

Pattabhi On ORR: వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు.. ఓఆర్ఆర్ ఆమోదం కోసం కేంద్రానికి 189 కి.మీ డీపీఆర్ పంపితే.. ప్రస్తుత వైకాపా సర్కార్ దానికి ఉరి వేసిందని మండిపడ్డారు. కేవలం 78 కి.మీ బైపాస్ రోడ్డు ఇస్తే చాలని కేంద్రమంత్రికి లేఖ రాయటం దారుణమన్నారు. చంద్రబాబు ముందుచూపుతో అనేక నిర్ణయాలు తీసుకుంటే.. వైకాపా ప్రభుత్వం నాశనం చేస్తుందని దుయ్యబట్టారు.

TDP spokesperson Pattabhi on Outer Ring Road

author img

By

Published : Dec 19, 2021, 6:01 PM IST

Updated : Dec 20, 2021, 3:25 AM IST

Pattabhi On ORR: అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డును (ఓఆర్‌ఆర్‌) రూ.17,761 కోట్లతో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం చెబుతుంటే... అది వద్దని, విజయవాడకు 78 కి.మీ. బైపాస్‌ రోడ్డు చాలంటూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెప్పడం ఓఆర్‌ఆర్‌కు ఉరివేయడం కాకపోతే మరేమిటని తెదేపా జాతీయ అధికారి ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నించారు. అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంటులో పదే పదే స్పష్టం చేస్తున్నా సరే.... కేంద్రం ఆ ప్రతిపాదనను చెత్తబుట్టలో పడేసిందని అబద్దాలు చెప్పడానికి మంత్రి పేర్ని నానికి సిగ్గు అనిపించడం లేదా అని నిలదీశారు. ముందు ఆయన ఔటర్‌ రింగ్‌రోడ్డుకు... బైపాస్‌ రోడ్డుకు తేడా ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. ఎవరైనా 189 కి.మీ.ల ఓఆర్‌ఆర్‌ను వద్దని.. 78 కి.మీ.ల బైపాస్‌ రోడ్డు చాలంటారా? ఇది దుర్మార్గం కాదా? అని పట్టాభి ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో, ఆ తర్వాత ‘ఈనాడు’తోనూ ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ జరిపి ఇస్తే ఓఆర్‌ఆర్‌ నిర్మిస్తామని కేంద్రం చెబుతుంటే అది వద్దని ఎలా లేఖ రాస్తారు? అంటూ నిలదీశారు. పట్టాభిరామ్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

.

ఓఆర్‌ఆర్‌కు, బైపాస్‌కు తేడా తెలీదా?

* వైకాపా ప్రభుత్వానికి, మంత్రి పేర్ని నానికి... ఓఆర్‌ఆర్‌కీ, బైపాస్‌ రోడ్డుకీ తేడా తెలీదా? రాజధాని అమరావతితో పాటు, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలను మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాలను కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగమే ఓఆర్‌ఆర్‌. ఇది కేవలం ట్రాఫిక్‌ తగ్గించటానికి ఉద్దేశించినది కాదు.. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే చోదకశక్తి. విజయవాడపై ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించేందుకు నిర్మిస్తున్న బైపాస్‌ రోడ్డూ, ఈఓఆర్‌ఆర్‌ ఒకటే అన్నట్లుగా మాట్లాడతారా? ఓఆర్‌ఆర్‌ కేవలం విజయవాడను దృష్టిలో పెట్టుకుని రూపొందించలేదన్న విషయం మీకు తెలీదా?

* విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని జనాభానే సుమారు 18.50 లక్షలు. ప్రతిపాదిత ఓఆర్‌ఆర్‌ పరిధిలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మొత్తం జనాభా 36-37 లక్షలు ఉంటుందని అంచనా. వాస్తవాలు ఇలా ఉంటే... విజయవాడ జనాభా కేవలం 10 లక్షలేనని, కేవలం విజయవాడ కోసం గత ప్రభుత్వం నగరానికి 40 కి.మీ.ల దూరం నుంచి ఓఆర్‌ఆర్‌ ప్రతిపాదించిందనీ అబద్ధాలు చెప్పడం ఏమిటి? ఓఆర్‌ఆర్‌కి పూర్తిగా లోపల ఉన్నవి, ఓఆర్‌ఆర్‌ వెళ్తున్న మండలాలు 40 ఉన్నాయి. దీనివల్ల విజయవాడ, గుంటూరులతో పాటు తెనాలి, మంగళగిరి, గుడివాడ, గొల్లపూడి, నూజివీడు, కొండపల్లి, పొన్నూరు, సత్తెనపల్లి, ఉయ్యూరు ప్రాంతాలు ఆర్థికంగా, పారిశ్రామికంగా శరవేగంగా పురోగతి సాధిస్తాయి. అలాంటి ఓఆర్‌ఆర్‌కు తిలోదకాలిచ్చి పైగా తామేదో మేలు చేస్తున్నామని, అభివృద్ధి అంతా తమ హయాంలోనే జరుగుతోందనీ జగన్‌ ప్రభుత్వం చెప్పడమేమిటి?

* ఇప్పుడు నిర్మాణంలో ఉన్న విజయవాడ బైపాస్‌రోడ్డును కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రానికి ఎలాంటి సంబంధమూ లేదు. పైగా రాజధాని అమరావతి ప్రతిపాదనకు ముందే... 2011లోనే ఆ బైపాస్‌ రోడ్డుకు ప్రణాళిక సిద్ధమైంది. 2012లో భూసేకరణ జరిగింది. గతంలోనే గామన్‌ ఇండియా సంస్థకు ఆ రోడ్డు నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తే... ఆ సంస్థ పనులు చేయలేదు. మళ్లీ టెండర్లు పిలిచి వేరే సంస్థలకు అప్పగించారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం దాన్నీ తన ఖాతాలోనే వేసేసుకుని గొప్పలు చెప్పడమేమిటి?

* కృష్ణా జిల్లాలో 49, గుంటూరు జిల్లాలో 39 గ్రామాలను తాకుతూ వెళ్లేలా ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. ఆర్‌.వి.అసోసియేట్స్‌ సంస్థ ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేసింది. 11 ప్రధాన వంతెనలు, ఏడు ఆర్‌వోబీల నిర్మాణం చేపట్టదలిచాం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 3,404 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. అందుకు రూ.4,200 కోట్లు అవసరమని లెక్క తేల్చాం. మొదటి దశలో కంచికచర్ల నుంచి పొత్తూరు వరకూ 63 కి.మీ, రెండో దశలో పొత్తూరు నుంచి పొట్టిపాడు వరకూ 53 కి.మీ. మూడోదశలో పొట్టిపాడు నుంచి కంచికచర్ల వరకూ 65 కి.మీ మేర నిర్మించేలా ప్రణాళిక వేశాం.

* ఏయే జిల్లాల్లో ఎంతెంత భూమి సేకరించాలి? ప్యాకేజీల వారీగా ఎలా పూర్తి చేయాలి? వివరాలతో ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి తెదేపా హయాంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ఫీజిబిలిటీ నివేదిక సిద్ధం చేసి వివరంగా కేంద్రానికి పంపించాం. ఇవన్నీ గూగుల్‌ మ్యాప్‌లో పిచ్చి గీతలా?

* ఓఆర్‌ఆర్‌ పూర్తయితే 4 లక్షల ఎకరాల భూమి అభివృద్ధి కార్యక్రమాలకు అందుబాటులోకి వస్తుంది. 36-37 లక్షల మంది జనాభాకు సరిపడా మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి.

గుంతలు పూడ్చలేని మీరు..ఫ్లై ఓవర్లు కట్టారా?

* రోడ్లపై గుంతలు పూడ్చడానికే దిక్కులేని వైకాపా ప్రభుత్వం.. విజయవాడలోని దుర్గగుడి, బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్లు కట్టిందా? అది జనం నమ్మాలా?
* జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ ప్రాజెక్టులను ఎలా అటకెక్కించారో అదే తరహాలో ఓఆర్‌ఆర్‌కూ ఇప్పుడు ఉరేశారు.

ఓఆర్‌ఆర్‌కు కట్టుబడి ఉన్నామని పార్లమెంటులో చెప్పడం.. చెత్తబుట్టలో పడేయడమా?

2016 మార్చి 14: ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు ‘అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. రూ.17,761 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తాం’ అని కేంద్రం సమాధానమిచ్చింది.
2017 ఆగస్టులో: తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌ నాయుడు వేసిన ప్రశ్నకు ‘అమరావతి ఓఆర్‌ఆర్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాం. 189 కి.మీ మేర దీన్ని నిర్మిస్తాం’ అని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
2019 జులైలో: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన ప్రశ్నకు ‘భారత్‌మాల పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 28 రింగ్‌రోడ్లు నిర్మించదలిచాం. అందులో అమరావతి ఓఆర్‌ఆర్‌ ఒకటి. 189 కి.మీ నిర్మించేందుకు డీపీఆర్‌ ప్రక్రియ ప్రారంభించాం’ అని కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు.
2020 మార్చి 5: తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు.. ‘ఫీజిబిలిటీ నివేదిక సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేసి ఇస్తే అమరావతి ఓఆర్‌ఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టు చేపడతాం’ అని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు.

* తాజాగా తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సమాధానమిస్తూ.. ‘189 కి.మీ అమరావతి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు ఫీజిబిలిటీ నివేదిక సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ జరిపితే నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్దని చెప్పింది. దానికి బదులుగా విజయవాడకు 78 కి.మీ బైపాస్‌ ఇవ్వండి చాలు అని కోరింది’ అని వెల్లడించారు.

* కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా పదే పదే ఓఆర్‌ఆర్‌ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెబుతుంటే.. ‘అసలు డీపీఆరే లేదు... ఏ పనులూ జరగలేదు. రాష్ట్రం పంపించిన ప్రతిపాదనల్ని కేంద్రం చెత్తబుట్టలో పడేసింది’ అని మంత్రి పేర్ని నాని ఎలా చెబుతారు? కేంద్ర మంత్రి మాట్లాడిన ఇంగ్లిష్‌ పేర్ని నానికి అర్థమవ్వకపోతే పక్కనున్న వారిని ఎవరినైనా అడిగి తెలుసుకోవాల్సింది.

* ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు కోసం మేము అన్నీ సిద్ధం చేశాం. ఈ ప్రభుత్వం భూ సేకరణ కోసం రూ.4 వేల కోట్లు వెచ్చించలేకపోతోందా?

ఇదీ చదవండి

Nitin Gadkari on ORR: ఓఆర్ఆర్​కు ఉరి!...రాష్ట్ర అభివృద్దికి విఘాతం

Telangana letter to KRMB: 'ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు మాత్రమే చేశాం.. ఆయకట్టు పెంచలేదు'

Last Updated : Dec 20, 2021, 3:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.