విశాఖలో ప్రమాణాల సవాళ్లతో రాజకీయ మాటల యుద్ధం జరుగుతోంది. వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్... వెలగపూడి రామకృష్ణబాబుపై చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్కు రాజకీయ భవిష్యత్ కల్పించింది తెలుగుదేశం అనే విషయం మర్చిపోయారని విమర్శించారు. ఎంపీ విజయసాయి రెడ్డికి సవాలు చేస్తే... కింది స్థాయి నేతలు వచ్చి మాట్లాడటంలో అర్థం లేదన్నారు. ఆరోపణలు చేస్తున్న వైకాపా నేతలు ఎంపీ విజయసాయి రెడ్డిని తీసుకుని వచ్చి ప్రమాణం చేసి.. తమ చిత్తశుద్ధి ఏమిటో నిరూపించుకోవాలని వారు సవాల్ చేశారు.
వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు వ్యతిరేకంగా విశాఖలో తెదేపా నిరసన ర్యాలీ చేపట్టింది. ఎంవీపీ కాలనీలో వెలగపూడి కార్యాలయం నుంచి చేపట్టిన తెదేపా శ్రేణుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి