ETV Bharat / city

ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన తెదేపా నేతలు - టీడీపీ వార్తలు

విశాఖలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని తెదేపా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. తెదేపా నేతలు అయ్యన్న, బండారు, వెలగపూడి ఉపరాష్ట్రపతిని కలిశారు. స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉదయపు నడకలో ఉపరాష్ట్రపతి దుకాణదారులతో ముచ్చటించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన తెదేపా నేతలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన తెదేపా నేతలుఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన తెదేపా నేతలు
author img

By

Published : Dec 11, 2020, 12:48 PM IST

Updated : Dec 11, 2020, 1:58 PM IST

విశాఖలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును తెలుగుదేశం నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ నాగ జగదీష్, తెదేపా నగర అధ్యక్షుడు పల్లా శీను ఉపరాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. గతంలో శంకుస్థాపన చేసిన ఈఎస్​ఐ ఆసుపత్రికి అడ్డంకులు తొలగించి నిర్మాణం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని నేతలు ఉపరాష్ట్రపతిని అభ్యర్థించారు.

సాగర్ నగర్​లో ఉదయపు నడకలో చిల్లర దుకాణదారులతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముచ్చటించారు. ప్రత్యేక అనుమతితో కొందరు సందర్శకులు ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వెంకయ్యనాయుడికి ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం దృష్ట్యా స్థానికంగా ఉన్న సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చదవండి : దేరసాంలో అగ్నిప్రమాదం... 12పూరిళ్లు దగ్ధం

Last Updated : Dec 11, 2020, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.