విశాఖ పర్యటనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం నిరసన దీక్ష చేపడుతున్న కార్మికులు నిర్వాసితుల వద్దకు వెళ్లకుండా స్వామీజీని కలసి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు తెదేపానేత బండారు సత్యనారాయణమూర్తి. ఉక్కు కర్మాగారం కోసం రాజకీయాలకతీతంగా ఉద్యమం చేస్తున్న కార్మికులను విమానాశ్రయానికి రప్పించుకొని చర్చలు జరిపిన సీఎం..పోస్కోని కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తామని చెప్పడంతో.... ఆయనకి, పోస్కోకి ఉన్న సంబంధం బట్టబయలు అయిందని ఆరోపించారు.
తనపై ఉన్న కేసులకు కేంద్రంతో లాలూచీపడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జగన్మోహన్ రెడ్డి మౌనం దాల్చడం తగదన్నారు. ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితిలో అడ్డుకొని తీరుతామని బండారు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: