ETV Bharat / city

విశాఖ ఉక్కు కోసం పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి: అయ్యన్న - latest news in ayyanna

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రానిది అనాలోచిత నిర్ణయమని తెదేపా నేత అయ్యన్న ధ్వజమెత్తారు. దీనిపై సీఎం జగన్ కేంద్రంతో మాట్లాడాలన్నారు.

Ayyanna
అయ్యన్నపాత్రుడు
author img

By

Published : Feb 5, 2021, 5:28 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర నిర్ణయాన్ని అందరూ ఖండించాలని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం 64 గ్రామాలను తీసుకున్నారన్న అయ్యన్న...ఉక్కు పరిశ్రమలో 40వేల మంది వరకు పని చేస్తున్నారన్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి మరో లక్షమంది బతుకుతున్నారని వివరించారు. మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షల మంది రోడ్డున పడతారన్నారు. ఉక్కు పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు అనేకమంది నాయకులు ఆదుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు వీల్లేదన్న అయ్యన్న...దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మౌనం వీడి వెంటనే కేంద్రంతో మాట్లాడాలని సూచించారు. జగన్‌ 20 సార్లు దిల్లీ వెళ్లారు.. రాష్ట్రానికి ఏం తెచ్చారు..అని అయ్యన్న ప్రశ్నించారు. కేంద్ర పెద్దలను కలిసినప్పుడు అందరూ మీడియాతో మాట్లాడతారు... మీరు మాత్రం అంతా గోప్యంగా ఉంచుతారు ఎందుకని నిలదీశారు.

ఇదీ చదవండి:

'విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం షాక్​కు గురి చేసింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.