పగటి వేషగాళ్లు పోస్కోను కలిసి బుకాయిస్తున్నారంటూ.. తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని గాజువాక కూడలిలో.. పార్టీ నేతలతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. వైకాపా ప్రభుత్వం ఏబీసీడీ పాలసీ తెచ్చిందన్న చంద్రబాబు.. ఏ అంటే ఎటాక్.. బీ అంటే బర్డెన్.. సీ అంటే కరప్షన్.. డీ అంటే డిస్ట్రక్షన్ అనీ.. ఇదే ప్రస్తుత ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు. మద్యంపై రూ.5 వేల కోట్లు తీసుకుంటున్నారని.. మద్యాన్ని అడ్డుపెట్టుకుని రూ.50 వేల కోట్లు అప్పు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో.. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాక.. ఏప్రిల్ 1 నుంచి ఇంటిపన్నులు పెంచబోతున్నారని అన్నారు.
'"రాణిరుద్రమ, అల్లూరి, బెబ్బులిపులిలా మీరంతా పోరాడాలి. తెదేపాను గెలిపించాలి. 2029కి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్‌వన్ చేయాలనుకున్నా. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు తలపెట్టా. ప్రజలకు మంచి చేయలేకపోయానని చాలా బాధపడుతున్నా. నేను పదవులు కోరుకునే వ్యక్తిని కాదు" - చంద్రబాబు, తెదేపా అధినేత
ఇదీ చదవండి:
ఎంపీ విజయసాయిరెడ్డికి భంగపాటు.. నిలదీసిన సీఐటీయూ కార్యకర్తలు