.
SUPER MOM: వైజాగ్ ఎక్స్‌పోలో 'సూపర్ మామ్'.. అలరించిన ర్యాంప్ వాక్ - విశాఖ జిల్లా తాజా వార్తలు
SUPER MOM: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న వైజాగ్ ఎక్స్‌పోలో 'సూపర్ మామ్' పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లులు, తమ పిల్లలతో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. పలువురు పిల్లలు.. అమ్మతో తమకున్న అనుబంధం, తమ అభ్యున్నతికి అమ్మ చేసిన కృషి, త్యాగాలను పంచుకున్నారు. కుటుంబమంతా ఆనందించే వేదికగా వైజాగ్ ఎక్స్‌పోను తీర్చిదిద్దామని నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవుల్లో వైజాగ్ ఎక్స్‌పోకి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు.
వైజాగ్ ఎక్స్‌పోలో సూపర్ మామ్ పేరిట కార్యక్రమం
.