రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందామని యత్నించిన యువకుడి ప్రయత్నం విశాఖ రైల్వే స్టేషన్ లో కలకలం రేపింది. మధ్యాహ్నం నాలుగో నెంబర్ ప్లాట్ ఫాంపై రైలు వస్తున్నతరుణంలో ఓ యువకుడు రెండు పట్టాల మధ్యకు వెళ్లాడు. ఆత్మహత్యకు ధైర్యం చాలక పట్టాల మధ్యనే బిక్కుబిక్కుమంటూ పడుకుండిపోయాడు. దీనిని గుర్తించిన ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని రక్షించి అదుపులోకి తీసుకున్నారు. కౌన్సిలింగ్ చేసి వదిలి వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆర్పీఎఫ్ పోలీసులని వివరణ కోరగా.. ఏం జరగలేదని, యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విజిలెన్స్ అధికారుల వేధింపులు.. కడపలో నూనె మిల్లు యజమాని ఆత్మహత్య