విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. శాసన మండలి సభ్యుడు దువ్వారపు రామారావు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొనేందుకు లోకేశ్ విశాఖ వచ్చారు. ఈ సందర్బంగా విశాఖ ఎయిర్ పోర్టులో లోకేశ్‌ను.. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కలసి వినతి పత్రం ఇచ్చారు. మా గోడు చెప్పుకుందామంటే..కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనివ్వలేదని వాపోయారు.
నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్న లోకేశ్.. పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అఖిల కార్మిక సంఘాలను కలుపుకుని కేంద్రం మీద ఒత్తిడి తేవాలన్నారు. తెెదేపా విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. స్టీల్ ప్లాంట్ కార్మిక ఉద్యమ పరిస్థితిని వివరించారు.
ఇదీ చదవండి...