విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘాల నిరసన దీక్షకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క సంఘీభావం తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే.. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. ఉద్యోగులు, నిర్వాసితుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఆలోచన చేస్తోందని విశాఖలో భాజపా నేతలు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుఅంటూ నినదించారు.
- ఇదీ చదవండి : అవరోధాలు తొలగితే పరిషత్ ఎన్నికలు : ఎస్ఈసీ