ETV Bharat / city

విశాఖలో అడుగు పెట్టనివ్వం: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ - విశాఖ ఉక్కు పోరాట సమితి

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు స్టీల్ పరిరక్షణ కమిటీ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేసింది. దిల్లీ జంతర్‌మంతర్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఉక్కు కర్మాగారం కొనేందుకు ఎవరినీ విశాఖపట్నంలో అడుగుపెట్టనీయబోమని వివిధ పార్టీల నాయకులు హెచ్చరించారు. తెలుగుజాతి పోరాట ప్రతీకగా నిలిచిన ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు.

steel plant protest at jantar mantar delhi

author img

By

Published : Aug 3, 2021, 6:31 AM IST

ఉక్కు కర్మాగారం కొనేందుకు ఎవరినీ విశాఖపట్నంలో అడుగుపెట్టనీయబోమని వివిధ పార్టీల నాయకులు హెచ్చరించారు. తెలుగుజాతి పోరాట ప్రతీకగా నిలిచిన ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. విశాఖలో చదువుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీ జంతర్‌మంతర్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. పోలీసులు అడుగడుగునా నిర్బంధించినా, మరోపక్క జోరువాన కురుస్తున్నా కర్మాగారం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. కార్మికుల పోరుకు సీపీఎం, సీపీఐ, ఎల్జేడీ, వైకాపా, తెదేపా ఎంపీలు, కాంగ్రెస్‌, వామపక్ష అనుబంధ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐకేఎస్‌, ఐద్వా, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు మద్దతు తెలిపారు.

'పార్టీలకు అతీతంగా పోరాడాలి'

పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పోరాడి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుందామని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ చెప్పారు.. దీనికోసం పార్లమెంటు లోపల, వెలుపలా తెదేపా పోరాటం చేస్తుందని చెప్పారు. వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, చింతా అనురాధ, గొడ్డేటి మాధవితో పాటు ఇతర ఎంపీలు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయాలకు అతీతంగా పోరాడదామని సూచించారు. కరోనా వేళ దేశానికి ఆక్సిజన్‌ అందించి ప్రాణాలు కాపాడిన కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు పోరాడాలి.. లేదంటే మరణించాలని సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు రోడ్లపైకి వస్తేనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కార్మికుల ఐక్యతను భగ్నం చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత పెరిగినా కేంద్రం తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, ఐద్వా కోశాధికారి పుణ్యవతి, ఏఐకేఎస్‌ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్‌ తదితరులు మాట్లాడారు. వామపక్ష ఎంపీలు వి.శివదాసన్‌, జాన్‌ బిట్రాస్‌, బినోయ్‌ విశ్వం, ఎల్జేడీ ఎంపీ శ్రేయమ్స్‌ కుమార్‌, ఎమ్మెల్యే అదీప్‌ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు (తెదేపా), స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ నేతలు సి.హెచ్‌.నరసింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, అయోధ్యరామ్‌, పలువురు విశాఖపట్నం కార్పొరేటర్లు పాల్గొన్నారు.

.

పోలీసు నిర్బంధం

ధర్నాలో పాల్గొనేందుకు దిల్లీ వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు, కార్మికులపై దిల్లీ పోలీసులు నిఘా పెట్టి, ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వారు దిగిన హోటళ్ల నుంచి బయటకు రాకుండా ప్రయత్నాలు చేశారు. జంతర్‌మంతర్‌కు వచ్చేందుకు ఆటో ఎక్కిన వారిని దింపేశారు. కాలినడకన రాకుండా ఆంక్షలు విధించారు. వీటన్నింటిని ఛేదించి, వందలాది మంది ఉద్యోగులు, కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు.

ప్రైవేటీకరించకుండా చూస్తాం: మంత్రి ముత్తంశెట్టి

స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మహా విశాఖ మేయరు హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో వైకాపా, వామపక్ష పార్టీల కార్పొరేటర్లు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సోమవారం విశాఖలో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు మాట్లాడారు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ప్రవేటీకరణను సవాలు చేస్తూ.. దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.