Sri Kanaka Mahalakshmi utsavalu News: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విశాఖపట్నం పాతనగరం బురుజు పేటలోని శ్రీ కనక మహా లక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాల్లో భాగంగా మూడో గురువారం సందడి నెలకొంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత దేవస్థానంలో తొలి పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణ చేశారు. అమ్మవారి దర్శనం కోసం చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు భారీగా తరలి వచ్చారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. పసుపు నీళ్ల కలశాలు, జ్యోతులతో ఊరేగింపు నిర్వహించారు.
Sri Kanaka Mahalakshmi Temple Bussy with devotives today: అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో జ్యోతి మాధవి వివరించారు. గత వారం కంటే ఈసారి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అంచనా ఉందని.. ఆమేరకు ప్రసాదం పంపిణీ, క్యూలైన్ నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని.. అందుకు సహకరించాలని ఆమె కోరారు.
ఇదీ చదవండి..