పండగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాల్తేర్ డివిజన్ మీదుగా మరో నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
వివరాలు...
* తిరుపతి-విశాఖపట్నం(02708) ప్రత్యేక డబుల్ డెక్కర్ ట్రై వీక్లీ ప్రత్యేక రైలు ఈ నెల 14 నుంచి ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మర్నాడు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం వస్తుంది.
* విశాఖ-తిరుపతి(02707) ప్రత్యేక డబుల్ డెక్కర్ ట్రైవీక్లీ ప్రత్యేక రైలు ఈనెల 15 నుంచి ప్రతి గురు, శని, సోమవారాల్లో రాత్రి 10.25 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 11.35 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
* సికింద్రాబాద్-విశాఖపట్నం(02784) ప్రత్యేక ఎ.సి. వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 17 నుంచి ప్రతి శనివారం సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 6.50 గంటలకు విశాఖ వస్తుంది.
* విశాఖపట్నం-సికింద్రాబాద్(02783) ప్రత్యేక ఎ.సి, వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ఈనెల 18 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 7.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
* కామాఖ్య-యశ్వంత్‌పూర్(02552) ప్రత్యేక ఎ.సి. వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 14 నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కామాఖ్యలో బయలుదేరి గురువారం రాత్రి 10 గంటలకు విజయనగరం చేరుకొని అక్కడినుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం 6.25 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.
* యశ్వంత్‌పూర్-కామాఖ్య (02551) ప్రత్యేక ఎ.సి. వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 17 నుంచి ప్రతి శనివారం ఉదయం 8.30 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 4.30 గంటలకు విజయనగరం చేరుకొని అక్కడినుంచి 4.40 గంటలకు బయలుదేరి మూడవరోజు మధ్యాహ్నం 2 గంటలకు కామాఖ్య చేరుకుంటుంది.
* సంత్రాగచ్చి-చెన్నై(02807) ప్రత్యేక ఎ.సి. బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఈనెల 16 నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 7.05 గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి బుధ, శనివారాల్లో ఉదయం 7.55 గంటలకు విశాఖ చేరుకొని అక్కడినుంచి 8.15 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 10.45 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.
* చెన్నై-సంత్రాగచ్చి (02808) ఎ.సి. బై వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 18 నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో ఉదయం 8.05 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి అదేరోజు రాత్రి 8.35 గంటలకు విశాఖ వస్తుంది. అక్కడినుంచి 8.55 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 10.30 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుందని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
ఇదీ చదవండి: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... 15నుంచి సేవలు