ఇదీ చదవండి : అబద్ధాలు, సీఎం జగన్ అవిభక్త కవలలు: నారా లోకేష్
సమావేశాలు సజావుగానే జరుగుతాయి:సభాపతి తమ్మినేని - ఏపీలో మూడు రాజధానుల వార్తలు
శాసనసభ సమావేశాలు సజావుగానే జరుగుతాయనే నమ్మకం తనకుందని.... సభాపతి తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. నిరసనలు తెలిపే వారు ఎప్పుడూ ఉంటారన్న ఆయన... రాజధాని మార్పు కేంద్రం పరిధిలోకి రాదన్నారు. ఇదే విషయంపై ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టత ఇచ్చారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. శంకుస్థాపన చేసి మట్టి, నీళ్లు ఇచ్చారు కదా అని బదులిచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తిగా మూడు రాజధానుల ప్రతిపాదనను తాను గట్టిగా సమర్థిస్తానని చెప్పారు.
speaker thamineni comments on assembly sessions
ఇదీ చదవండి : అబద్ధాలు, సీఎం జగన్ అవిభక్త కవలలు: నారా లోకేష్