ETV Bharat / city

Somu Veerraju Controversy Statements: సోమువీ'ర్రాజు'కున్న మాటల మంటలు... - కడపలో ఎయిర్ పోర్టు పై సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు

Somu Veerraju Controversy Statements: కడపలో ఎయిర్ పోర్టు విషయమై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కడప జిల్లా ప్రజలను కించపరిచేలా ఉన్నాయని అధికార, వామపక్ష నేతలు మండిపడ్డారు. ఆ తరువాత కడప ప్రజలకి హత్య రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తన మాటల్ని వక్రీకరించారని ఆరోపించారు.

Somu Veerraju Controversy Statements
సోమువీ'ర్రాజు'కున్న మాటల మంటలు...
author img

By

Published : Jan 29, 2022, 4:52 AM IST

సోమువీ'ర్రాజు'కున్న మాటల మంటలు...

Somu Veerraju Controversy Statements: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖలో విలేకర్లతో మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘రాయలసీమలో ఎయిర్‌పోర్ట్‌.. కడపలో ఎయిర్‌పోర్ట్‌.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్ట్‌.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు..’ అని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. దీనిపై అధికార వైకాపాకు చెందిన రాయలసీమ ప్రాంత నేతలతో పాటు వామపక్ష రాష్ట్ర నేతలూ తీవ్రంగా మండిపడ్డారు. రాయలసీమ ప్రజల సంస్కృతిని కించపరిచేలా సోము వీర్రాజు వ్యాఖ్యలు ఉన్నాయని ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘కడప ప్రజలపై ఆయన వ్యాఖ్యలు ఒక ప్రాంత ప్రజల మనోభావాలను కించపరచడమే. ఇవి ఆయన వ్యక్తిగత విమర్శలా? పార్టీ విధానమా? వెంటనే క్షమాపణ చెబితే ఆయనకు గౌరవంగా ఉంటుంది. సినిమాల్లో లాభాల కోసం ఫ్యాక్షన్‌ గురించి చూపిస్తున్నారు’ అని చెప్పారు. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కడప జిల్లా ప్రజలను కించపరిచేలా ఉన్నాయని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. రాయలసీమతో పాటు కడప జిల్లా వాసులను అనాగరికులుగా చిత్రీకరిస్తూ ప్రాణాలు తీసే హంతకులుగా ముద్రవేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజుది పెద్ద తప్పని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మండిపడ్డారు. సీమ చరిత్రపై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని సవాలు విసిరారు. వీర్రాజు కడపలో కనబడితే ఆయనపై ప్రజలు మూకుమ్మడిగా తిరగబడతారని హెచ్చరించారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు హేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. భాజపా కుట్రలను ప్రజాస్వామ్య, లౌకికవాదులంతా ఖండించాలని రామకృష్ణ కోరారు. వీర్రాజు వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ప్రజలను క్షమాపణ కోరాలన్నారు.

నా మాటలు వక్రీకరించారు

కడప ప్రజలకు, హత్యా రాజకీయాలకు సంబంధం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన జారీచేశారు. ‘నేను విశాఖలో గురువారం విలేకర్ల సమావేశంలో చెప్పిన వివరాలను పలువురు వక్రీకరించారు. మాజీ మంత్రి వివేేకానందరెడ్డి హత్యకేసులో రాజకీయ నేతలు ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో నేను మాట్లాడితే మరో రకంగా చిత్రీకరించారు’ అని వీర్రాజు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : Support Rally for New Districts : కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ మహిళల ర్యాలీలు..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.