Snow on Simhagiri : విశాఖ జిల్లా సింహాచలం సింహగిరిని నేడు మంచు దుప్పటి కప్పేసింది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు లంబసింగి ప్రాంతాలను తలపించేలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జనవరిలో మంచు ఇలా కనిపించడం విశేషం.స్వామి దర్శనానికి వచ్చే భక్తులంతా మంచు మేఘాల్లో సింహగిరులు తేలియాడటాన్ని చూసి పరవశించిపోయారు. ఈ అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అరకు, లంబసింగి ప్రాంతాలను తలపిస్తోందని మురిసి మైమరిచిపోయారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు,ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి : CPI NARAYANA : 'తెగేవరకు లాగకుండా పీఆర్సీ సమస్యను పరిష్కరించండి'
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!